Best Film Colour Photo: కసిగా 68వ జాతీయ అవార్డు కొట్టిన కలర్ ఫోటో.. ఆహా అనిపించిన తెలుగు సినిమా..
68వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక తాజాగా ఢిల్లీ లో అట్టహాసంగా జరుగుతోంది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల...
68వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక తాజాగా ఢిల్లీ లో అట్టహాసంగా జరుగుతోంది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు దక్కనున్నాయి. ఇక జాతీయ తెలుగు ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకుంది కలర్ ఫోటో సినిమా. చిన్న సినిమాగా 100 పర్సెంట్ తెలుగు ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా జాతీయ స్థాయిలో మన్ననలు పొదడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ రాజ్ డైరెక్ట్ చేశారు. సుహాస్, షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ చాందినీ చౌదరీ హీరో హీరోయిన్లుగా నటించారు. పోలీస్ క్యారెక్టర్లో.. పవర్ ఫుల్ విలన్‌గా సునీల్ కనిపించారు.ఇక ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ను అమృత ప్రొడక్షన్స్ అండ్ లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది. అయితే కోవిడ్ కారణంగా… తెలుగు ఓటీటీ ఆహాలో రిలీజై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా కట్టిపడేసింది. సినిమా చూస్తున్నంత సేపు ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు జాతీయ ఉత్తమ తెలుగు సిమాగా నిలిచి.. అంతటా వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..