కొడుకు తీసుకున్న లోన్ కట్టలేదని.. వృద్ధ తల్లిదండ్రులపై బ్యాంక్ సిబ్బంది దౌర్జన్యం
సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజానగర్‌లో కొడుకు తీసుకున్న లోన్ కట్టలేదని వృద్ధ తల్లిదండ్రులపై బ్యాంక్ సిబ్బంది దౌర్జన్యం చేశారు. ఇంటికి తాళం వేసి సామాగ్రి బయట పడేశారు. లోన్ గురించి తెలియదంటున్న బాధితులు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. స్థానికులు బ్యాంక్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజానగర్‌లో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు తీసుకున్న లోన్ కట్టలేదని బ్యాంక్ సిబ్బంది వృద్ధ తల్లిదండ్రులపై దౌర్జన్యం చేశారు. తల్లిదండ్రులకు తెలియకుండానే కొడుకు రూ. 8 లక్షల లోన్ తీసుకుని, దానిని తీర్చకుండానే దేశం విడిచి పారిపోయాడు. లోన్ కట్టలేదనే కారణంతో బ్యాంక్ సిబ్బంది ఆ వృద్ధుల ఇంటికి తాళం వేసి, ఇంట్లోని సామాగ్రిని బయట పడేశారు. కొడుకు లోన్ తీసుకున్న విషయం కూడా తమకు తెలియదని ఆ వృద్ధ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లి మాట్లాడుతూ, తెలియకుండా సంతకం చేయించుకుని కొడుకు లోన్ తీసుకున్నాడని, ఇప్పుడు వారికి నాలుగు ఆపరేషన్లు అయ్యాయని, భర్తకు గుండెపోటు వచ్చిందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: దిగి వచ్చిన పుత్తడి ధర.. నేడు ఎంతంటే
విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం
ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు
అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే
క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

