Duvvada Srinivas: ‘ఎలా తిరిగినా తమకు సంబంధం లేదు’.. దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్‌లో కొత్త టర్న్‌

Updated on: Aug 17, 2024 | 5:43 PM

ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం కొత్త టర్న్‌ తీసుకుంది. రాజీమార్గంపై టీవీ9 ఇంటర్వ్యూలో దువ్వాడ వాణీ మన్‌ కీ బాత్‌ ఏంటో తెల్సా.. తనకు రాజకీయాలు, ఆస్తులు అక్కర్లేదన్నారు దువ్వాడ వాణీ. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండడమే ముఖ్యమంటున్నారు ఆమె. మరి ఇంకా ఆమె ఏమన్నారో తెలుసా..

తమకు ఆస్తులు, రాజకీయాలు అక్కర్లేదన్నారు దువ్వాడ వాణీ. ఎప్పట్లానే తామంతా కలిసి ఒకే ఇంట్లో ఉండాలన్నదే తమ డిమాండ్‌ అన్నారామె. కూతురి కోసం పెళ్లి కోసం.. సమాజం కోసం కలిసి వుండడమే ఈ వివాద ముగింపు మార్గమని టీవీ9తో చెప్పారు వాణీ. ఆయనేం చేసుకున్నా ఫర్వాలేదు..ఎలా తిరిగినా తమకు సంబంధం లేదన్నారు. కాకపోతే తమతో కలిసి ఒకే ఇంట్లో ఉండాలన్నారు. ఈ విషయంలో ఆయనకేవైనా అభ్యంతరాలుంటే కండీషన్స్‌ పెట్టొచ్చని.. ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరించడానికి తాను సిద్ధమన్నారు వాణీ.