దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్ పే బంపర్ ఆఫర్ వీడియో
దీపావళి పండుగ వేళ ఫోన్ పే వినియోగదారుల కోసం కేవలం రూ.11 ప్రీమియంతో రూ.25,000 విలువైన ప్రత్యేక బాణసంచా బీమా పథకాన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఇది పాలసీదారుడు, జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు 11 రోజుల పాటు రక్షణ కల్పిస్తుంది. యాప్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు, పండుగ వేడుకలను సురక్షితంగా జరుపుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.
దసరా, దీపావళి పండుగల సమయంలో వ్యాపార సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీపావళి వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చడం ద్వారా జరిగే ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు ఈ పథకం ఉద్దేశించబడింది. కేవలం రూ.11 ప్రీమియంతో రూ.25,000 విలువైన బీమా పాలసీని ఫోన్ పే అందిస్తోంది. ఈ పాలసీ కింద పాలసీదారుడు, వారి జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు కవరేజీ లభిస్తుంది. ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా లేదా మరణం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి 11 రోజుల పాటు ఈ పాలసీ చెల్లుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఫోన్ పే యాప్ ద్వారా నిమిషం లోపే ఈ బీమాను సులభంగా కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
