Mushroom: మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

|

Dec 31, 2024 | 8:08 PM

వింత వింత పుట్టగొడుగులకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఇడుపులపాయ నిలుస్తోంది. ఇటీవల చెయ్యి ఆకారంలో మొలిచిన పుట్టగొడుగు అందరినీ ఆశ్చర్యపరిస్తే.. తాజాగా కాలు ఆకారంలో కనిపించి మరింత ఆశ్చర్యపరిచింది. ఈ వింత పుట్టగొడుగులను చూడటానికి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఇడుపులపాయకు క్యూ కడుతున్నారు. చెయ్యి, కాలు అయిపోయింది, నెక్ట్స్‌ మనిషి ఆకారంలో పుట్టగొడుగులు పుడుతాయోమోనని చమత్కరించుకుంటున్నారు.

వాస్తవానికి సహజసిద్ధంగా లభించే పుట్టగొడుగులు చాలా అరుదు. ఇవి సంవత్సరంలో చిత్తకార్తెలో మాత్రమే ఎక్కువగా లభించేవి. ప్రస్తుతం చిత్తకార్తెలో సైతం ఇవి చాలా అరుదుగా లభిస్తున్నాయి. వానలు కురిసినప్పుడు లేక వాతావరణం చల్లగా మారినప్పుడు పుట్టకూడు ఉన్న పుట్టల్లో, మట్టిదిబ్బల్లో ఇవి పైకి పొడుచుకువస్తాయి. అలా పొడుచుకువచ్చిన పుట్టగొడుగులను కూర వండుకు తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.
Voice..
పుట్టగొడుగులు ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో మొలుస్తాయి. అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. ఇడుపులపాయలో మొలుస్తున్న పుట్టగొడుగులు మాత్రం భిన్నంగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వింత పుట్టగొడుగులను స్థానికులు వీడియో తీసి షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.