Dengue Baby: కడుపులో బిడ్డకు డెంగ్యూ.. కోల్‌కతాలో అరుదైన కేసు నమోదు.

|

Sep 23, 2023 | 9:09 PM

నవజాత శిశువుకు తల్లి నుంచి డెంగ్యూ వ్యాధి సోకిన అతి అరుదైన ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. అయితే ఇది వర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌ ద్వారా అంటే తల్లి నుంచి వచ్చే స్రవాల ద్వారా బిడ్డకు వైరస్‌, ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు గుర్తించారు. కోల్‌కతా లేక్‌ టౌన్‌కు చెందిన 29 ఏళ్ల నిండు గర్భవతి సెప్టెంబర్‌ 9న డెంగ్యూ జ్వరంతో చర్నాక్‌ దవాఖానలో చేరింది. అప్పటికే ఆమె ప్లేట్‌లెట్‌ కౌంట్‌ 40 వేలుకి పడిపోయింది.

నవజాత శిశువుకు తల్లి నుంచి డెంగ్యూ వ్యాధి సోకిన అతి అరుదైన ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. అయితే ఇది వర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌ ద్వారా అంటే తల్లి నుంచి వచ్చే స్రవాల ద్వారా బిడ్డకు వైరస్‌, ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు గుర్తించారు. కోల్‌కతా లేక్‌ టౌన్‌కు చెందిన 29 ఏళ్ల నిండు గర్భవతి సెప్టెంబర్‌ 9న డెంగ్యూ జ్వరంతో చర్నాక్‌ దవాఖానలో చేరింది. అప్పటికే ఆమె ప్లేట్‌లెట్‌ కౌంట్‌ 40 వేలుకి పడిపోయింది. చేరిన నాలుగో రోజున ఆమెకు సిజేరియన్‌ ద్వారా ప్రసవం చేసిన డాక్టర్లు తర్వాత రొటీన్‌ రక్త పరీక్షలలో ఆమెకు డెంగ్యూ ఇంకా ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో పుట్టిన బిడ్డకు కూడా పరీక్షలు నిర్వహించగా ఆ శిశువుకు కూడా డెంగ్యూ ఉన్నట్టు తేలింది. దీంతో బిడ్డకు కొద్ది రోజుల పాటు ఐవీ థెరపీ చేయడంతో కోలుకుంది. తల్లీబిడ్డలిద్దరూ ఆ వ్యాధి నుంచి బయటపడటంతో వారిని డిశ్చార్జి చేశారు. అత్యంత అరుదైన సందర్భాలలో మాత్రమే తల్లి ప్లాసెంటా నుంచి కడుపులోని పిండానికి ప్రసవానికి ముందు గానీ, ప్రసవ సమయంలో కాని, ప్రసవమైన వెంటనే కానీ సోకే అవకాశం ఉందని, ఈ కేసులో అదే మాదిరిగా తల్లి నుంచి బిడ్డకు డెంగ్యూ వ్యాధి సోకి ఉండవచ్చునని వైద్య నిపుణులు తెలిపారు. ఇది దోమలలో సాధారణమని, అయితే మనుషుల్లో అతి అరుదుగా జరుగుతుందని సంక్రమిత వ్యాధుల నిపుణులు చెప్పడం గమనార్హం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..