Delhi Rains: దేశ రాజధానిలో కుండపోత వర్షం.. నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు.. షాకింగ్ విజువల్స్ -Watch Video
Delhi Rains: దేశరాజధాని ఢిల్లీలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతో ఎన్‌సీఆర్ పరిధిలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గుర్‌గ్రామ్‌లో భారీ వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Delhi Heavy Rains: దేశరాజధాని ఢిల్లీలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతో ఎన్‌సీఆర్ పరిధిలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గుర్‌గ్రామ్‌లో భారీ వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుర్‌గ్రామ్ -ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ హైవే నీట మునిగింది. దీంతో వందలాది వాహనాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. కొన్ని కార్లు నీటిలో మునిగిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. బస్సులు కూడా వరదనీటిలో చిక్కుక్కుపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. అటు ఢిల్లీ-రోహతక్ రోడ్డు నీట మునిగింది.ఢిల్లీ ఔటర్‌రింగ్‌రోడ్డు , బహదూర్‌ఘర్ రోడ్‌లో కూడా ప్రయాణికుల కష్టాలు పెరిగాయి. అటు వాతావరణ శాఖ శనివారంనాటికి ఢిల్లీలో ఎల్లో అలెర్ట్ జారీ చేయడంతో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.