Cyclone Remal: తుఫాన్ బీభత్సం.. ఆ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్.. కుండబోత వర్షాలు..

|

May 27, 2024 | 7:55 AM

బంగాళాఖాతంలో కల్లోలం సృష్టించిన రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ విభాగం తెలిపింది. దీని కారణంగా బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక రెమాల్ తుఫాన్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో..

బంగాళాఖాతంలో కల్లోలం సృష్టించిన రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ విభాగం తెలిపింది. దీని కారణంగా బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక రెమాల్ తుఫాన్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలో ఏకంగా ఏడుగురు మృతి చెందారు. తాడూరు శివారులో రేకుల షెడ్డు కూలి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పిడుగుపాటుకు గురయ్యారు. మరొకరు ఈదురుగాలులకు ఇటుక రాయి కారుపై ఎగిరిపడడంతో అద్దం గుచ్చుకొని చనిపోయారు. వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రజల్ని భయపెట్టింది. గాలి దుమారానికి ఇంటిపైనున్న రేకులు కొట్టుకుపోయాయి. ధారూర్ మండలంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Follow us on