బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్..ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ వీడియో
దిత్వా తుఫాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది. శ్రీలంకను ముంచిన ఈ తుఫాను ఏపీ, తమిళనాడుపై ప్రభావం చూపనుంది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్యా తుఫాను ఆంధ్రప్రదేశ్ వైపు వేగంగా దూసుకొస్తోంది. శ్రీలంకను ముంచిన ఈ తుఫాను ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దిత్వా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు మోగించారు.
మరిన్ని వీడియోల కోసం :
