అమ్మో.. అల్పపీడనం వారం రోజులు వానలే
బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాల్లో వారం రోజులపాటు భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దసరా వేడుకల నేపథ్యంలో ప్రజలు, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులకు మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా, ఆపై తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ కుమర్ తెలిపారు. ఇది అక్టోబర్ 3వ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారుతుందని అంచనా. వర్షాల తీవ్రతను బట్టి ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, యానాం ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
