Loading video

Hyderabad: మూసీలో మొసలి కలకలం.. హడలిపోయిన స్థానికులు

| Edited By: Ram Naramaneni

Nov 25, 2023 | 1:20 PM

మూసీ నది కనిపించిన మొసలి స్థానికుల్లో టెన్షన్ రేపింది. రంగారెడ్డి జిల్లా రజేంద్రనగర్ అత్తాపూర్ ప్రాంతంలోని మూసి నదిలో ఓ మొసలి కలకలం రేపింది. నదిలోని ఓ పెద్ద రాయి మీదకు చేరి సేదతీరుతున్న మొసలిని స్థానికులు చూసి ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

మూసీ నది కనిపించిన మొసలి స్థానికుల్లో టెన్షన్ రేపింది. రంగారెడ్డి జిల్లా రజేంద్రనగర్ అత్తాపూర్ ప్రాంతంలోని మూసి నదిలో ఓ మొసలి కలకలం రేపింది. నదిలోని ఓ పెద్ద రాయి మీదకు చేరి సేదతీరుతున్న మొసలిని స్థానికులు చూసి ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మూసి నదిలో ఈ ఒక్క మొసలే కాదు ఇంకా చాలానే ఉన్నాయని… గతంలో నాలుగు మొసళ్లను చూశామంటున్నారు స్థానికులు. హిమాయత్ సాగర్, గండిపేట జలాశయం నుండి మొసళ్ళు కొట్టుకొచ్చినట్లు చెబుతున్నారు. నది తీరాన సంచిరిస్తున్న మొసలిని సంబంధిత అధికారులు పట్టుకుని తమ ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ మొసలి ఎప్పుడో ఒకసారి మాత్రమే ఒడ్డున కనిపించడంతో అధికారులకు సైతం ఏం చేయాలో పాలుపోవడం లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 25, 2023 01:17 PM