షాపింగ్ చేయడం కూడా ఒక రోగమే.. దాని వాళ్ళ కలిగే నష్టాలు తెలిస్తే షాకే

Updated on: Dec 29, 2025 | 4:28 PM

షాపింగ్ వ్యసనం ఉన్నవారికి నిరంతరం కొనుగోళ్లు చేయాలనే కోరిక ఉంటుంది, లేకపోతే చిరాకు, ఆందోళనలు ఎదురవుతాయి. ఇది ఆర్థిక నష్టాలకు, అప్పులకు దారితీస్తుంది, అలాగే డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను పెంచుతుంది. చాలామంది పరిశోధకులు దీనిని వ్యాధిగా గుర్తిస్తారు. బిహేవియరల్ థెరపీ, కౌన్సెలింగ్ ద్వారా ఈ వ్యసనం నుండి బయటపడవచ్చు. సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

షాపింగ్ వ్యసనం! ఇది ఉన్నవాళ్లకు నిత్యం ఏదో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. లేకపోతే మనసు ఆరాటం ఆగదు. చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఏదో కోల్పోయినట్టుగా ఫీలవుతారు. ఏదైనా కొంటేనే హ్యాపీగా ఉన్నట్టు భావిస్తారు. దీనివల్ల అంతగా అవసరంలేని వస్తువులు కూడా కొనిపడేస్తారు. ఆ తర్వాత అనవసరంగా కొన్నాను అని బాధపడతారు. దీంతో ఖర్చులు పెరిగిపోయి అప్పులు కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి ముదిరిన వారు యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి షాపింగ్ ఆడిక్షన్ కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. చాలా మంది పరిశోధకులు దీనిని వ్యాధిగా భావిస్తున్నారు. కొందరికి కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్ ఉంటుంది. దీనిని సాధారణ భాషలో షాపింగ్ అడిక్షన్ అంటారు. ఇలాంటి వారు బట్టల కోసం డబ్బు ఖర్చు చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. షాపింగ్ వ్యసనాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తున్నారు. ఈ రుగ్మత అబ్బాయిల కంటే అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారికి బిహేవియరల్ థెరపీ, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స అందించవచ్చు. ఇక ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక ఫోబియా కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తాము ఒక ఫోబియాతో లేక మానసిక సమస్యతో బాధపడుతున్నామనే విషయమే చాలా మందికి తెలియట్లేదంటున్నారు. అందువల్ల ఎవరికి వారు చెక్​ చేసుకొని, పరిస్థితి ఇబ్బందికరంగా అనిపిస్తే వైద్యులను సంప్రదించడం మేలని సూచిస్తున్నారు. నెగెటివ్‌ ఫీలింగ్‌కు సంబంధించిన ఫోబియాలను ట్రీట్ చేసేందుకు ప్రత్యేకంగా నిపుణులు ఉంటున్నారు. వారిని సంప్రదించడం ద్వారా సమస్య నుంచి బయటపడాలని చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేటి తాజా వార్తా.. నగరం లో ముసుగు దొంగలు సంచరిస్తున్నారు జాగ్రత్త

BSNL నుంచి అద్భుత ప్లాన్‌!రూ. 251కే 100 GB డేటా

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే

బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..