Rain Alert: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. నేటి నుంచి పలు జిల్లాల్లో వర్షాలు.

|

Jun 25, 2023 | 9:35 AM

ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో వానలు పడనున్నాయి. మరో వైపు రాయలసీమను నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తాకాయి. దక్షిణాంధ్రాలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రేపు తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.

ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో వానలు పడనున్నాయి. మరో వైపు రాయలసీమను నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తాకాయి. దక్షిణాంధ్రాలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రేపు తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల జనం, రైతులు ఎప్పుడెప్పుడా అని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైతులతే వర్షాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వరుణ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అని ఆకాశానికేసి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తియ్యని కబురు అందించింది. రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయని.. నేడు, రేపు రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రెండు రోజుల్లో వర్షాలు పెరుగుతాయని పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Published on: Jun 25, 2023 09:17 AM