CM KCR: ప్రగతి భవన్‌లో రక్షాబంధన్ వేడుక.. అక్కల కాళ్లకు నమస్కరించిన కేసీఆర్
ప్రగతి భవన్‌లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ తోబుట్టువుల ప్రేమానురాగాలతో ప్రగతి భవన్‌లో సందడి నెలకుంది. రాఖీ కట్టిన తర్వాత కేసీఆర్ అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ కూడా పక్కనే ఉన్నారు. కాగా అంతకముందు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ అంటే అనుబంధానికి రక్షాబంధనం. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను మరింత పటిష్టం చేసేదే రాఖీ పండుగ. తమ సోదరులు ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ తనకెప్పుడు రక్షణగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటూ.. ఎంతో ఆప్యాయంగా కట్టేదే రాఖీ. కాగా హైదరాబాద్ ప్రగతిభవన్‌లో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుకు ఆయన అక్కాచెల్లెమ్మలు రాఖీలు కట్టారు. ప్రతి సంవత్సరం సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టేందుకు ఆయన సోదరీమణులుకుటుంబంతో సహా ప్రగతిభవన్‌కు వచ్చి ఆనందోత్సాహాల మధ్య వేడుక జరుపుకుంటారు. రక్షాబంధన్ వేడుకతో ప్రగతిభవన్ మొత్తం సందడిగా మారింది. కాగా సీఎం కేసీఆర్ తనకంటే పెద్దవారైన అక్కలకు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.