మామిడి రైతులకు తప్పని కష్టాలు..ఏం జరిగిందంటే

Edited By:

Updated on: Jun 30, 2026 | 9:52 PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు తగ్గుతున్న ధరలు, కొనుగోలుదారులు లేకపోవడం వారిని దిక్కుతోచని స్థితిలో పడేసింది. వ్యాపారుల సిండికేట్, మామిడి గుజ్జు పరిశ్రమల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకు మామిడిని విక్రయించాల్సి వస్తోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను కష్టాలు వీడట్లేదు. రోజురోజుకు ధర తగ్గుతుండటంతో… దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఓవైపు మార్కెట్‌లో ఘోరంగా తగ్గిన మామిడి కొనుగోళ్లు… మరోవైపు పట్టించుకోని మామిడి గుజ్జు పరిశ్రమలు.. వెరసి బోరుమంటున్నారు రైతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మధురమైన మామిడి పండించే రైతులకు.. ఈ ఏడాది చేదే మిగిలింది. సీజన్ ముగుస్తున్నా ఆశించిన ధర అందక మామిడి రైతు దిగాలు పడుతున్నారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారడంతో… దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు మామిడి రైతులు. టన్ను మామిడికి 3 వేలకు మించి దక్కకపోవడంతో మామిడి రైతు ఆవేదన చెందుతున్నాడు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలో… మొత్తం 1.70 లక్షల ఎకరాల్లో 7.50 మెట్రిక్‌ టన్నుల తోతాపూరి మామిడి దిగుబడి వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ర్యాంపులు ఏర్పాటు చేసి మామిడి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. ఎప్పటిలాగే ఈసారి కూడా సిండికేట్‌గా మారారు. టన్నుకు 4 వేల చొప్పున ప్రోత్సాహక నగదును ప్రకటించిన ప్రభుత్వం… రాంపులు, గుజ్జు పరిశ్రమలు, మండిల్లో టన్ను 8 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని చెబుతున్నా… తోతాపురికి కిలో 3రూపాయలకు మించి దక్కట్లేదు. మార్కెట్‌లో మాత్రం వ్యాపారులు కిలో 8 నుంచి 10 రూపాయల దాకా తోతాపురిని అమ్ముతున్నారు. దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర సరే… కనీసం కొనుగోలు చేసే నాథుడైనా ఉంటే చాలన్నట్టుగా తయారైంది రైతుల పరిస్థితి. ట్రాక్టర్లలో మామిడిని పెట్టుకుని గుజ్జు పరిశ్రమల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరి, ఈ మామిడి మంటలు ఎంతవరకు ఎగబాకుతాయో… పొలిటికల్‌గా ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే ఐటీ ఉద్యోగులను మించిన ఐడియా!

అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!

క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!

“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!

ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు

Follow Us