Chicken Price: తెలుగురాష్ట్రాల్లో కొండెక్కిన కోడి మాంసం ధర.. సామాన్యుడు కొనడానికేనా..?

|

Jun 10, 2023 | 7:20 PM

మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌గా చెప్పాలి. ఎందుకంటే, ఆంధ్ర, తెలంగాణలో బాయిలర్ చికెన్ ధరలు కొండెక్కాయి. వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ, చికెన్‌ కొనుగోళ్లు మాత్రం నానాటికీ ఊపందుకుంటున్నాయి. నెల రోజుల క్రితం కిలో చికెన్‌ ధర రూ.200 పలికింది.

మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌గా చెప్పాలి. ఎందుకంటే, ఆంధ్ర, తెలంగాణలో బాయిలర్ చికెన్ ధరలు కొండెక్కాయి. వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ, చికెన్‌ కొనుగోళ్లు మాత్రం నానాటికీ ఊపందుకుంటున్నాయి. నెల రోజుల క్రితం కిలో చికెన్‌ ధర రూ.200 పలికింది. కానీ, గత 15- 20 రోజులుగా రూ.300 నుంచి రూ.350కి పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ చికెన్ ధర రూ.350లకు చేరుకుంది. డిమాండ్‌ పెరడంతో ధర ఎంత ఉన్న ప్రజలు తప్పనిసరిగా చికెన్‌ కొనుగోలు చేస్తున్నారు. విజయవాడలో చికెన్ ధర ఆల్ టైం హైరేట్ కి చేరింది. మరోనెల రోజుల పాటు ఇవే రేట్లు కొనసాగే చాన్స్ ఉందంటున్నారు కోళ్ల ఫామ్ నిర్వహకులు. విజయవాడ, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో చికెన్‌ రేట్‌ అమాంతంగా పెరిగింది. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 350 కాగా, కిలో బోన్‌లెస్ చికెన్ ధర రూ.700లకు చేరింది. ఇక కోళ్ల ఫారంలోనే లైవ్ బర్డ్ కిలో రూ.166లకు పలుకుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.