వందేళ్ల తర్వాత హైదరాబాద్‌లో.. కొత్తగా అతిపెద్ద రైల్వేస్టేషన్‌

|

Oct 25, 2024 | 3:40 PM

హైదరాబాద్‌లో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. మరొకిద్ది రోజుల్లోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌తో కలిసి చర్లపల్లి స్టేషన్‌లో పర్యటించిన ఆయన.. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో రైల్వేలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కిషన్‌రెడ్డి. హైదరాబాద్‌లో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా చర్లపల్లి రూపొందుతోంది. సుమారు 430 కోట్లతో ఎయిర్‌పోర్టును మైమరపించేలా ఈ రైల్వే టెర్మినల్‌ను కేంద్రం అద్భుతంగా నిర్మించింది. ఇక.. చర్లపల్లిలో ఇప్పటికే ఐదు ప్లాట్ ఫామ్‌లు ఉండగా.. వీటికి అదనంగా మరో 4 ప్లాట్ ఫామ్‌లు రెడీ చేశారు. మొత్తం.. 9 ప్లాట్‌ఫామ్‌లు, 9 లిఫ్ట్‌లు, 5 ఎస్కలేటర్లు, రెండు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణమైంది. దాదాపు పనులు పూర్తి కావడంతో త్వరలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దాంతో.. వందేళ్ల తర్వాత హైదరాబాద్‌లో కొత్తగా అతిపెద్ద రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి రానుంది. అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు కిషన్‌రెడ్డి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ghee Coffee: కొవ్వు తగ్గాలంటే ఘీ కాఫీ

బిగ్‌ బాస్‌లో.. టెర్రర్ పుట్టించిన గంగవ్వ దెబ్బకు కంటెస్టెంట్స్‌ హడల్

తన భార్యపై వెకిలి కామెంట్స్‌ చేసినవారికి మాటలతో ఇచ్చి పడేసిన మణికంఠ

మరో చిన్నారికి ప్రాణం పోసిన దేవుడు !! మహేష్ పై ఫ్యాన్స్‌ ప్రశంసలు

Ram Charan: రూ.7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న చరణ్.. టాలీవుడ్‌లో ఇంత కాస్ట్రీ వెహికల్ మరెవరికీ లేదట !!

Follow us on