గుడ్‌న్యూస్.. గ్యాస్ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
పశ్చిమాసియా సంక్షోభం సద్దుమణగడంతో ద్రవీకృత సహజవాయువు (LNG) దిగుమతులు తిరిగి సాధారణ స్థితికి చేరాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరాపై అమల్లో ఉన్న చివరి అత్యవసర ఆంక్షను కూడా ఎత్తివేసింది. తాజా నిర్ణయంతో పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు ఊరట లభించనుండగా, ఇకపై గ్యాస్ కేటాయింపులు సాధారణ వాణిజ్య విధానాల ప్రకారమే కొనసాగనున్నాయి.
దేశంలో గ్యాస్ సరఫరాపై గత కొన్ని నెలలుగా విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతరాయం ఏర్పడిన ద్రవీకృత సహజవాయువు రవాణా తిరిగి సాధారణ స్థితికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఈ మేరకు ‘నేచురల్ గ్యాస్ ఆర్డర్, 2026’కు సవరణలు చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల హర్మూజ్ జలసంధి మార్గంలో ఎల్‌ఎన్‌జీ నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో ఈ ఏడాది మార్చి 9న కేంద్రం అత్యవసర నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా కేవలం గృహ అవసరాలు , రవాణా రంగం , ఎరువుల కర్మాగారాలు వంటి కీలక రంగాలకే గ్యాస్ కేటాయించి.. విద్యుత్ ప్లాంట్లు, పెట్రోకెమికల్స్ వంటి ప్రాధాన్యత లేని రంగాలకు కోతలు విధించింది. అయితే, ప్రస్తుతం అక్కడ కాల్పుల విరమణ అమల్లోకి రావడం, శాంతి చర్చలు సఫలం కావడంతో సముద్ర రవాణా పుంజుకుంది. ఈ సంక్షోభ సమయంలో విధించిన మూడు అత్యవసర ఆంక్షల్లో ఇదొక్కటే మిగిలి ఉండగా.. దీనిని కూడా ప్రభుత్వం ఇప్పుడు ఉపసంహరించుకుంది. ఇప్పటికే బల్క్ డీజిల్ అమ్మకాలపై ఆంక్షలను, రిఫైనరీల ఉత్పత్తి నిబంధనలను కేంద్రం రద్దు చేసింది. తాజా నిర్ణయంతో పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలపై ఒత్తిడి తగ్గనుంది. ఇకపై గ్యాస్ కేటాయింపులు పాత పద్ధతిలోనే సాధారణ వాణిజ్య ఒప్పందాల ప్రకారం కొనసాగుతాయని స్పష్టమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటో తెలిస్తే..
Maa Inti Bangaram: ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్, ఎగ్స్ ధర