ఉద్యోగుల గ్రాట్యుటీ గందరగోళానికి కేంద్రం చెక్

Updated on: Jan 29, 2026 | 10:40 AM

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల గ్రాట్యుటీ చెల్లింపులపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. రూ. 20 లక్షల గరిష్ట పరిమితి అమలు, అర్హత, చెల్లింపు కాలపరిమితులు వంటి అంశాలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. సీపీఎస్‌ఈ ఉద్యోగులకు 2018 మార్చి 29 నుండి ₹20 లక్షల పరిమితి వర్తిస్తుందని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) ఉద్యోగుల గ్రాట్యుటీ చెల్లింపులపై నెలకొన్న గందరగోళానికి కేంద్రం తెరదించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డీపీఈ) స్పష్టమైన, ఏకీకృత మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రాట్యుటీ అర్హత, చెల్లింపుల కాలపరిమితులు, రూ. 20 లక్షల గరిష్ట పరిమితి ఎప్పటి నుంచి వర్తిస్తుందనే విషయాలపై ఈ మెమోరాండం వివరణ ఇచ్చింది. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972కు 2018లో చేసిన సవరణల మేరకు, గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచింది. ఈ సవరించిన నిబంధనలు 2018 మార్చి 29 నుండి అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం, 2018 మార్చి 29 లేదా ఆ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన, గ్రాట్యుటీకి అర్హులైన సీపీఎస్‌ఈ ఉద్యోగులందరికీ రూ. 20 లక్షల గరిష్ట పరిమితి వర్తిస్తుంది. ఇది చట్టబద్ధమైన నిబంధన కావడంతో, సంస్థల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా తప్పనిసరిగా చెల్లించాలని డీపీఈ స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌