గర్భనిరోధానికి ఇక పిల్స్‌తో పనిలేదు.. ఈ కొత్త సాధనం వచ్చేసిందిగా
సాధారణంగా బిడ్డకీ బిడ్డకీ మధ్య మూడేళ్లు గ్యాప్ అవసరమని చెబుతారు నిపుణులు. అందుకే దంపతులు ఈ పద్ధతిని పాటించేందుకు రకరకాల మార్గాలు అవలంభిస్తారు.
సాధారణంగా బిడ్డకీ బిడ్డకీ మధ్య మూడేళ్లు గ్యాప్ అవసరమని చెబుతారు నిపుణులు. అందుకే దంపతులు ఈ పద్ధతిని పాటించేందుకు రకరకాల మార్గాలు అవలంభిస్తారు. నోటిమాత్రలు, ఇంజెక్షన్స్, కాపర్‌టీ, కండోమ్స్ ఇలా రకరకాల సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పడు ఈ అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్నీని అడ్డుకునేందుకు సరికొత్త సాధనం అందుబాటులోకి తేనుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక సన్నని సూదిలాంటి సాధనం. దీనిని మహిళల మోచేతికింద మెత్తని చర్మం పొరల్లో అమరుస్తారు. ఇది 3 నుంచి 4 సెంటీమీటర్ల పొడవు, 2 నుంచి 4 మిల్లీ మీటర్ల మందంతో ఉంటుంది. ఇది హార్మోన్‌తో తయారైంది… ఇది గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. తద్వారా మహిళ అండాశయం నుంచి అండం ఉత్పత్తికాదు. ఈ విధానాన్ని ‘సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్’ అంటారు. ఇది ఒక్కసారి అమర్చుకుంటే మూడేళ్లవరకూ పనిచేస్తుంది. అంతేకాదు ఇది పూర్తిగా సురక్షితం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకుని.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి !!