Car Racing: ట్యాంక్ బండ్‌పై మళ్లీ కార్ల రేసింగ్.. ట్యాంక్‌ బండ్‌ వేదికగా ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలు.

Updated on: Oct 25, 2023 | 10:25 AM

కార్‌ రేసింగ్‌ పోటీలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. నవంబర్‌ 4, 5 తేదీల్లో సాగర తీరాన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ జరగబోతోంది. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఈ పోటీలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇన్నాళ్లు స్పోర్ట్స్‌ చానెల్స్‌లో రేసింగ్‌ పోటీలు చూసి ఇంట్రెస్ట్‌ పెంచుకున్న నగరవాసులకు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం మళ్లీ వచ్చింది. గతేడాది నవంబర్‌లో మొదటిసారిగా ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలు హుస్సేన్‌సాగర్‌ తీరం కేంద్రంగా జరిగాయి.

కార్‌ రేసింగ్‌ పోటీలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. నవంబర్‌ 4, 5 తేదీల్లో సాగర తీరాన ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ జరగబోతోంది. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన ఈ పోటీలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇన్నాళ్లు స్పోర్ట్స్‌ చానెల్స్‌లో రేసింగ్‌ పోటీలు చూసి ఇంట్రెస్ట్‌ పెంచుకున్న నగరవాసులకు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం మళ్లీ వచ్చింది. గతేడాది నవంబర్‌లో మొదటిసారిగా ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పోటీలు హుస్సేన్‌సాగర్‌ తీరం కేంద్రంగా జరిగాయి. మళ్లీ రెండోసారి అదే ట్రాక్‌పై పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నిర్వాహకులు హెచ్‌ఎండీఏ అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పనులను చేపట్టారు. ఇదే ట్రాక్‌పై ఫార్ములా-ఈ పోటీలు సైతం విజయవంతంగా నిర్వహించడంతో కార్ల రేసింగ్‌ పరంగా హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా ఎంతో పేరు వచ్చింది.

అంతర్జాతీయ స్థాయిలో కనిపించే రేస్‌ కార్లు హుస్సేన్‌ సాగర్‌ తీరంలో మళ్లీ రయ్‌..రయ్‌మంటూ దూసుకుపోనున్నాయి. దేశీయ, అంతర్జాతీయ డ్రైవర్ల రేసింగ్‌ విన్యాసాలు కనువిందును చేయనున్నాయి. అత్యంత వేగంగా దూసుకువచ్చే కార్లకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు 2.8కి.మీ పొడవునా ఉన్న ట్రాక్‌ చుట్టూ ప్రీకాస్ట్‌ డివైడర్లు, వాటిపై ఎత్తయిన ఇనుప కంచెతో పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది నిర్వహించినపుడు ట్రాక్‌ చుట్టూ ఉన్న పరిస్థితులు నేడు విభిన్నంగా ఉన్నాయి. కొత్తగా సచివాలయం, 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్‌, అమరవీరుల స్మారక స్థూపం వంటివి ప్రారంభం కావడంతో ఈ ప్రాంతమంతా సరికొత్త శోభను తీసుకువచ్చింది. తాజాగా అంతర్జాతీయ ప్రమాణాలతో జరిగే కార్‌ రేసింగ్‌ పోటీలతో ఈ ప్రాంతం మరింత హైలెట్‌గా నిలవనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..