Risk Profiling: మీరు మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఏమిటి?

|

May 14, 2024 | 12:03 PM

మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మీ రిస్క్ ప్రొఫైల్‌ను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే మీరు కూడా ఇతరులు నష్టపోయినట్లుగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. కుమార్ అనే వ్యక్తి సెక్టోరల్/థీమాటిక్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాడు. అది అందించే అధిక రాబడి ఆయనను ఎంతగానో ఉత్సాహపరిచింది. అయితే వీటిల్లో రిస్క్ ఎక్కువని కుమార్ అర్థం చేసుకోలేదు. మార్కెట్‌లో అలజడితోనే తన పథకం పనితీరు

మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మీ రిస్క్ ప్రొఫైల్‌ను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే మీరు కూడా ఇతరులు నష్టపోయినట్లుగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. కుమార్ అనే వ్యక్తి సెక్టోరల్/థీమాటిక్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాడు. అది అందించే అధిక రాబడి ఆయనను ఎంతగానో ఉత్సాహపరిచింది. అయితే వీటిల్లో రిస్క్ ఎక్కువని కుమార్ అర్థం చేసుకోలేదు. మార్కెట్‌లో అలజడితోనే తన పథకం పనితీరు నెగిటివ్‌లోకి వెళ్లింది. కుమార్ తన రిస్క్ ప్రొఫైల్‌ను అర్థం చేసుకుని ఉంటే, ఆయన నష్టాన్ని తప్పించుకునేది. రిస్క్ ప్రొఫైలింగ్ అనేది మీ పెట్టుబడిలో ఎంత రిస్క్ తీసుకోవచ్చో తెలుసుకునే మార్గం.

రిస్క్ అర్థం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ప్రతి ఇన్వెస్టర్ రిస్క్ ప్రొఫైల్ వేరు.. పెట్టుబడిదారు రిస్క్ ప్రొఫైల్ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోగల సామర్థ్యం, ఆర్థిక స్థితి, వయస్సు వంటి వివిధ అంశాల ద్వారా నిర్ణయిస్తారని గుర్తించుకోండి. ఇన్వెస్టర్ రిస్క్ తెలిస్తే, సరైన ఆస్తులతో పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేయవచ్చు. మరి రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

 

Follow us on