నెల రోజులు.. 28 లక్షల కోట్లు అదీ మన యూపీఐ కెపాసిటీ బాస్

Updated on: Oct 24, 2025 | 4:33 PM

మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజికి డిజిటల్ పేమంట్స్ ఎక్కువుగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లో గూగుల్ పే, ఫోన్‌పే తప్పక ఉంటుంది. ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్స్‌ని ప్రోత్సహిస్తున్నారు. పండగల సీజన్ కావడంతో డిజిటల్ చెల్లింపులు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు మునుపెన్నడూ లేనంతగా పెరిగి ఆల్-టైమ్ రికార్డులను సృష్టిస్తున్నాయి.

దీపావళి కొనుగోళ్ల జోరుతో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ సరికొత్త మైలురాళ్లను అధిగమించింది. అక్టోబర్ నెలలో యూపీఐ ద్వారా జరుగుతున్న సగటు రోజువారీ లావాదేవీల విలువ ఏకంగా రూ. 94 వేల కోట్లకు చేరింది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. గత కొన్నేళ్లుగా జరుగుతున్న నెలవారీ యూపీఐ పేమెంట్లతో పోల్చి చూస్తే ఇది అత్యధిక వృద్ధి అని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల ఇంకా వారం రోజులు మిగిలి ఉండగానే యూపీఐ తన జీవితకాలంలోనే అత్యుత్తమ నెలవారీ ప్రదర్శనను నమోదుచేసే దిశగా దూసుకెళ్తోంది. గత కొన్ని నెలల లావాదేవీలతో పోల్చితే, అక్టోబర్‌లో UPI అత్యధిక వృద్ధిని సాధించింది. దీపావళి పండగతోపాటు ఇటీవల జీఎస్టీ రేట్లలో వచ్చిన మార్పులు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ నెల‌ 20న దీపావళి సందర్భంగా చెల్లింపులు భారీగా పెరిగాయి. పండగకు ముందు రోజు యూపీఐలో ఒక్కరోజే 74 కోట్ల లావాదేవీలు జరిగి ఆల్‌-టైమ్‌ రికార్డు సృష్టించాయి.సాధారణంగా, నెల ప్రారంభంలో జీతాలు, EMI చెల్లింపుల కారణంగా లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి. కానీ ఈసారి, దీపావళి శాపింగ్ కారణంగా నెల చివరి రోజుల్లోనే లావాదేవీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ దూకుడు చూస్తుంటే, ఈ నెలలో మొత్తం లావాదేవీల విలువ తొలిసారిగా రూ. 28 లక్షల కోట్లు దాటుతుందని, గత రికార్డయిన రూ. 25 లక్షల కోట్ల మార్కును అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 85 శాతం వాటా యూపీఐదే కావడం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాష్ట్రపతి హెలికాప్టర్‌ను నెట్టిన సిబ్బంది

TOP 9 ET News: ప్రభాస్ రూ.3500 కోట్లు..ఫిల్మ్ ఫెటర్నిటీలో ఒకే ఒక్కడు

Renu Desai: మీకు దండం పెడతాను.. ఇలాంటి వార్తలు వద్దు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..