ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే

Updated on: Dec 17, 2025 | 5:45 PM

కొత్త సంవత్సరంలో టీవీ, మొబైల్ ధరలు గణనీయంగా పెరగనున్నాయి. మెమొరీ చిప్ కొరత, రూపాయి విలువ పతనం దీనికి ప్రధాన కారణాలు. విదేశాల నుండి దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఆధారపడటం వల్ల జనవరి నుండి 3-4% పెరుగుదల తప్పదని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. ధరలు పెరగకముందే కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచన.

టీవీ, మొబైల్‌ ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఇప్పడే కొనేయండి.. ఎందుకంటే కొత్త సంవత్సరంలో టీవీ, మొబైల్‌ ధరలు వాచిపోనున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి టెలివిజన్‌ ధరలు పెరగనున్నాయి. మెమొరీ చిప్‌ల ధర అనూహ్యంగా పెరగడం, రూపాయి విలువ తగ్గి డాలర్‌తో రూపాయి మారకం విలువ 90 రూపాయలను దాటిన కారణంగా టీవీల ధరలు జనవరి నుంచి 3-4 శాతం పెరగనున్నాయి. రూపాయి పతనం ఈ పరిశ్రమను అస్థిరమైన స్థితిలోకి నెట్టేసింది. టీవీల తయారీకి వినియోగించే విడి పరికరాల్లో 30 శాతం మాత్రమే దేశీయమైనవి కాగా, ఓపెన్‌ సెల్‌, సెమీ కండక్టర్‌ చిప్స్‌, మదర్‌ బోర్డు లాంటి ముఖ్య పరికరాలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి తోడు ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో చిప్‌ల సంక్షోభం ఏర్పడటం టీవీల పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టింది. మెమొరీ చిప్‌ల పరిశ్రమలో సంక్షోభం మరో రెండు త్రైమాసికాలు ఇలాగే కొనసాగితే మరోసారి టీవీల ధరలు పెరగడం ఖాయమని ప్రముఖ బ్రాండ్‌ టీవీల తయారీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవల టీవీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల వినియోగదారుడికి కలిగిన ప్రయోజనం ఈ చిప్‌ల సంక్షోభం మింగేస్తున్నదని టీవీ డీలర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఈడీల ధరలను పెంచక తప్పదని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్‌

వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్‌

బాక్సాఫీస్ విజయానికి కొత్త మంత్రం.. సినిమాలో ఇది ఉంటే హిట్ పక్కా

సీనియర్ హీరోలకు ఆప్షన్ లేదు.. ఇంకా వారే దిక్కు

నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటున్న కుర్ర హీరోలు..