టోల్ గేట్లు.. ఇక కనుమరుగు రోడ్లపై కెమెరాలతో టోల్‌ వసూళ్లు

Updated on: Oct 19, 2025 | 11:30 AM

జాతీయ రహదారులపై టోల్‌గేట్లు త్వరలో కనుమరుగు కానున్నాయి. టోల్‌ఫీజు చెల్లింపునకు టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులుతీరిన దృశ్యాలు కొన్నాళ్ల తరువాత కనిపించవు కూడా. ఎందుకంటే టోల్‌ఫీజు వసూలు కోసం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా నిర్ణీత ప్రదేశాల్లో రోడ్లపైన ఏర్పాటు చేసిన కెమెరాలతో కూడిన ప్రత్యేక స్ట్రక్చర్లు.. ఆటోమేటిక్‌‌గా టోల్ వసూలు చేసుకుంటాయి.

భారతదేశ డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఇది మరో రకమైన మైలురాయి అని, దీనివల్ల వచ్చే 5 ఏళ్లలో హైవేలపై ‘అడ్డంకులు లేని’ టోల్ వసూళ్ల వ్యవస్థ సాకారం కానుందని కేంద్రం చెబుతోంది. ఇందులో భాగంగా.. హైవేలపై కెమెరాలతో ఉన్న ప్రత్యేక పిల్లర్లు ఏర్పాటు చేస్తారు. ఇవి వాహనాల నెంబరు ప్లేట్లను గుర్తించి ఆటోమేటిక్ గా టోల్ వాటికవే వసూలు చేసుకుని ఖాతాలో జమ చేసుకుంటాయి. దీని వల్ల వాహన దారులు రోడ్ల మీద ఆగాల్సిన పని ఉండదు. ఈ కొత్త విధానం వల్ల ప్రయాణ సమయం, ఇంధనం, ఖర్చులు ఆదా అవుతాయి. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. టోల్ ప్లాజాల దగ్గర పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోవాల్సిన పరిస్థితులు ఉండవు. హైవేల మీద మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో తరహా టోల్ సేవలకు ఇండియన్ హైవేస్ జారీ చేసిన టెండర్‌ను తాజాగా జియో పేమెంట్స్ బ్యాంక్ దక్కించుకుంది. ఈ MLFF వ్యవస్థ ఆధునిక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ టెక్నాలజీగా పనిచేస్తుంది. రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, డెడికేటెడ్ షార్ట్-రేంజ్ కమ్యూనికేషన్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 11 టోల్ ప్లాజాల్లో ఈ తరహా టోల్ ఆపరేషన్స్‌ను మేనేజ్ చేస్తున్న JPBLకు ఇది ఐదో MLFF బిడ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించిన కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ తాజా డెవలప్మెంట్ భారతీయ రోడ్డు రవాణా వ్యవస్థను మరింత స్మూత్‌గా మార్చడంలో కీలకమైందని చెప్పవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాల్లో వేలాడుతూ ప్రీ వెడ్డింగ్ షూట్.. ఇదేం క్రియేటివిటీ..

ఆఫీస్‌కి వెళ్లిన ఉద్యోగులకు షాక్.. దీపావళి బహుమతులు ఏంటంటే..

అమెరికా గ్రీన్ కార్డు .. 2028 వరకు భారతీయులకు ఛాన్సే లేదు

రూ.3 కోట్ల బెంజ్ కారు కొన్న రైతు.. ధోతీ కట్టుకొని వచ్చి ..

హైదరాబాద్ వాసికి రష్యాలో నరకం.. బలవంతంగా యుద్ధ రంగం లోకి