Gold Price Today: స్పల్పంగా తగ్గిన బంగారం షాకిస్తున్న వెండి

Updated on: Nov 27, 2025 | 6:25 PM

పెళ్లిళ్ల సీజన్ ముగిసిన తరుణంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి, అయితే వెండి ధరలు పెరిగాయి. గత రెండు రోజుల పెరుగుదల తర్వాత, గురువారం బంగారం రేటు తగ్గింది. హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో తాజా ధరలను ఇక్కడ చూడండి. అమెరికా మార్కెట్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడం ఈ మార్పులకు ప్రధాన కారణం.

పెళ్లిళ్ల సీజన్ ముగింపునకు వచ్చిన వేళ.. బంగారం ధరలు స్పల్పంగా తగ్గుతున్నాయి. గత రెండు రోజుల పాటు భారీగా పెరిగిన బంగారం ధరలు.. గురువారం కాస్త తగ్గుముఖం పట్టాయి. తులం గోల్డ్‌పై రూ.160 తగ్గగా.. వెండి మాత్రం షాకిచ్చింది. నవంబర్ 27, గురువారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,27,920 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,17,260 రూపాయలుగా ఉంది.హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,76,100 రూపాయలుగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,400 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,700 ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,750 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,100 ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,260 ఉంది. కోలకతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,260 ఉంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలే కారణమని చెప్పవచ్చు. ప్రధానంగా డిసెంబర్ నెలలో ఫెడరల్ రిజర్వ్ భేటీ జరగనుంది. ఇందులో కీలకమైన వడ్డీ రేట్ల పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో ప్రధానంగా వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్

ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం

ఫోన్‌‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు

తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..