భగ్గుమన్న బంగారం-తగ్గిన వెండిగురువారం ధరలు ఎలా ఉన్నాయి

Updated on: Oct 16, 2025 | 7:00 PM

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్, భారత్‌లో పండుగ సీజన్ కారణంగా బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి.అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందన్న అంచనాలు, చైనాతో కొనసాగుతున్న ఆర్థిక ప్రతిష్టంభన కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంపై పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు.

అక్టోబర్ 16, గురువారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,31,410 రూపాయిలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,21,690 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,86,000 రూపాయలుగా ఉంది. ముంబాయిలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,18,660 ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,650 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,18,810 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,18,660ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,390 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,18,610 ఉంది. కోల్‌కతా లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,18,810 ఉంది. మొత్తం మీద, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఉత్కంఠ, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత ఇవన్నీ కలిపి బంగారం, వెండి ధరలను ఆకాశానికెత్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Madhavan: 50 ప్లస్ లో దూకుడు చూపిస్తున్న మాధవన్

సీన్ రివర్స్.. టికెట్ రేట్లపై మళ్లీ బాంబు

వేలకోట్లకు అధిపతి.. అయినా సైకిల్‌పైనే సవారీ

భారత్‌లోనే రిచ్చెస్ట్ మహిళ రోష్ని.. ఆస్తి విలువ తెలిస్తే మైండ్ బ్లాకే