తగ్గిన బంగారం.. పెరిగిన వెండి.. ఇవాళ తులం ఎంతంటే

Updated on: Nov 14, 2025 | 5:36 PM

నవంబర్ 14న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.770, 22 క్యారెట్లపై రూ.700 తగ్గింది. అయితే, కిలో వెండి ధర రూ.100 పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం, వెండి రేట్లను ఈ కథనంలో చూడవచ్చు. కొనుగోలుకు ముందు తాజా ధరలను సరిచూసుకోవడం మంచిది.

కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర నవంబరు 14 శుక్రవారం స్వల్పంగా తగ్గింది. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.770 తగ్గి, రూ.1,27,850 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.700 తగ్గి రూ.1,17,200 కి చేరింది. వెండిధర కిలోకి రూ.100 పెరిగి రూ.1,83,100 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో శక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.1,28,780 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.300 తగ్గి రూ.1,18,060 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,850 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,17,200 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,160, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,400 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,850 , 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,200 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,27,850 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,17,200 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,83,100 లుగా ఉంది. ఈ ధరలు మధ్యాహ్న ఒంటి గంట తర్వాత నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన విద్యార్థులకు రష్యా బంపర్ ఆఫర్.. 300 ఉచిత స్కాలర్‌షిప్‌లు

సత్తాచాటిన తెలుగోడు.. శ్రీనగర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం

ఆ 3 గంటలు కారులో ఎందుకు ఉండిపోయాడు?

అమెరికన్లకు శిక్షణ ఇచ్చి వెళ్లిపోండి.. హెచ్​-1బీ వీసాలపై ట్రంప్‌ కొత్త స్వరం

రెండోసారి చోరికి వచ్చి.. జనానికి దొరికిపోయిన దొంగలు