Gold Price Today: తగ్గని బంగారం జోరు..గురువారం తులం ఎంతంటే?

Updated on: Dec 18, 2025 | 6:03 PM

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పుంజుకొని ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వెండి కూడా అదే బాటలో స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో 24 కేరట్ల బంగారం ధర తులం లక్ష రూపాయలు దాటింది. డాలర్ విలువ పడిపోవడం, చైనా వెండి ఎగుమతులపై ఆంక్షల వార్తలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది వెండి ధరలు 127% పెరిగాయి.

గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకొని ఆల్ టైం రికార్డ్ స్థాయి వద్ద కొనసాగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే భారీగా తులం బంగారంపై రూ.650 పెరగ్గా.. మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. బుధవారం నుంచి గురువారం మధ్య కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక బంగారం బాటలోనే వెండి కూడా స్వల్పంగా పెరిగింది. డిసెంబర్ 17, గురువారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,34,600 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,23,600 రూపాయలుగా ఉంది.హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,24,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,990 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,23,770 ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,840 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,23,600 ఉంది. చెన్నైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,710 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,24,400 ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,850 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,23,600 వద్ద కొనసాగుతోంది. కోల్ కతా లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,840 ఉండగా, 22 కేరట్ల10 గ్రాముల ధర రూ.1,23,600 వద్ద కొనసాగుతోంది. ఈ బంగారం ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం డాలర్ విలువ పడిపోవడమేనని నిపుణులు అంటున్నారు. 2026 నుంచి చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు విధించవచ్చన్న వార్తలు కూడా ధరలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు వెండి ధరలు 127 శాతం పెరగడం గమనార్హం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: వచ్చే రెండు రోజులూ జాగ్రత్త !! వాతావరణ శాఖ బిగ్‌ అలర్ట్‌

రైతులకు గుడ్‌ న్యూస్‌.. ఇక ఇంటి నుంచే యూరియా బుకింగ్‌

న్యూ ఇయర్ పార్టీకి ప్లాన్ చేస్తున్నారా? తేడా వస్తే తాట తీస్తారు

ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

Ravi Teja: కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ.. వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు బోధపడిందా