Gold Loans: గోల్డ్ రేట్ ఎఫెక్ట్.. రూ.3 లక్షల కోట్లకు చేరిన గోల్డ్ లోన్స్

Updated on: Sep 13, 2025 | 12:03 PM

బంగారం ధర రోజు రోజుకీ పెరిగిపోతోంది. 2024 డిసెంబరు 31 నాటికి 78,950 రూపాయలు ఉన్న స్వచ్ఛమైన బంగారం ధర ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 34,150 రూపాయలు మేర పెరిగింది. బంగారధర ఇలా ఆకాశాన్నంటుతుండటంతో గోల్డ్‌పై రుణాలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో గోల్డ్‌ లోన్లు రికార్డులు సృష్టిస్తున్నాయి.

ఈ ఏడాది ఆగస్టు నాటికి బ్యాంకుల గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఏకంగా రూ.2.94 లక్షల కోట్ల జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇలా పసిడి రుణాలు ఆల్ టైమ్ రికార్డుకు చేరడం ఇది వరుసగా 15వ నెల కావడం గమనార్హం. కేవలం ఏడాది వ్యవధిలో 10 గ్రాముల బంగారం ధర 53 శాతం పెరిగింది. 2024 ఏప్రిల్‌లో రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్న గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఇప్పుడు దాదాపు మూడు రెట్లు పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి ప్రతినెలా ఈ రుణాల్లో వార్షిక ప్రాతిపదికన 100 శాతానికి పైగా వృద్ధి నమోదవుతోంది. ముఖ్యంగా, బ్యాంకులు తనఖా లేని వ్యక్తిగత రుణాల జారీలో కఠినంగా వ్యవహరిస్తుండటం, వాటితో పోలిస్తే గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వంటివి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీంతో, వ్యక్తిగత రుణాలు పొందే అవకాశం లేని వారికి బంగారంపై రుణం ఒక ప్రత్యామ్నాయంగా మారింది. బంగారం ధరలు పెరుగుతున్నంత కాలం గోల్డ్ లోన్లకు డిమాండ్ కొనసాగుతుందని బాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. బంగారం విలువ పెరగడంతో వినియోగదారులు తమ వద్ద ఉన్న పసిడిపై గతంలో కంటే ఎక్కువ రుణం పొందగలుగుతున్నారని వారు తెలిపారు. ఇక దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.100 పెరిగి రూ.1,13,100కు చేరింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం తులం ఎంతంటే?

దేవాలయాల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం

Kishkindhapuri: సగం భయపెట్టి.. సగం వదిలేస్తే ఎలా? హిట్టా..? ఫట్టా..?

సీటు కోసం చితక్కొట్టుకున్న మహిళ, యువకుడు

IPHONE 17: ఐ ఫోన్ 17.. అక్కడ 97 వేలు.. మనకి 1.36 లక్షలు