8.20 శాతం వడ్డీతో నెలనెలా ఆదాయం పోస్టాఫీస్‌ సూపర్ స్కీమ్..

Updated on: Nov 02, 2025 | 6:56 PM

రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెలనెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే సీనియర్ సిటిజన్ల కోసం కేంద్రం అద్భుత పథకాన్ని అందిస్తోంది. అదే పోస్టాఫీస్ 'సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్'. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఏడాదికి 8.20 శాతం అత్యధిక వడ్డీ అందిస్తుంది.

ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో కనీసం 1000 రూపాయల నుంచి గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు. డిపాజిట్ చేసిన మొత్తంపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లెక్కింపు జరిగి, నేరుగా మీ అకౌంట్‌లో జమ అవుతుంది. ఐదేళ్ల మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత, డిపాజిట్ చేసిన పూర్తి మొత్తం వెనక్కి వస్తుంది. అవసరమనుకుంటే, ఈ పథకాన్ని మూడేళ్ల చొప్పున ఎన్నిసార్లయినా పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. దీని కోసం మెచ్యూరిటీకి ఏడాది ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతా తెరిచే నాటికి 60 ఏళ్లు నిండిన వారు అర్హులు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఉద్యోగులు 55 ఏళ్ల వయసు నుంచే ఈ పథకంలో చేరవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ లేదా బ్యాంకు శాఖకు వెళ్లి అవసరమైన కేవైసీ పత్రాలు జతచేసి ఈ ఖాతాను సులభంగా తెరవవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మతో ప్రతి క్షణం విలువైనదే.. ఆయుష్షును పెంచేదే

ఆ కార్లను తుక్కుగా అమ్మేస్తున్నారు

పగలు టెకీలు.. రాత్రయితే క్యాబ్‌ డ్రైవర్లు .. ఏంటీ నయా ట్రెండ్

చెత్తబుట్టలో కనిపించిన కోట్లు.. అంతలోనే

జియో యూజర్లకు గూగుల్ బంపరాఫర్..