జియో మరో సంచలనం.. రూ.799లకే సేఫ్టీ ఫోన్లు..విద్యార్థులకు ఫ్రీగా ఏఐ కోర్సు

Updated on: Oct 10, 2025 | 4:45 PM

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 వేదికగా భద్రతకు పెద్దపీట వేస్తూ సరికొత్త 'జియోభారత్' ఫోన్లను ఆవిష్కరించింది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ 'సేఫ్టీ-ఫస్ట్' ఫోన్లు ప్రారంభ ధర కేవలం రూ.799 మాత్రమే కావడం విశేషం. దీంతో పాటు విద్యార్థుల కోసం ఉచితంగా ఏఐ కోర్సును కూడా ప్రకటించింది.

ఈ కొత్త జియోభారత్ ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్, యూసేజ్ మేనేజ్‌మెంట్ వంటి కీలక ఫీచర్లను పొందుపరిచారు. లొకేషన్ ట్రాకింగ్ ద్వారా ఫోన్ వాడుతున్న వారు తమ రియల్-టైమ్ లొకేషన్‌ను నమ్మకమైన కాంటాక్ట్స్‌తో పంచుకోవచ్చు. ఇక ‘యూసేజ్ మేనేజర్’ టూల్ ద్వారా పిల్లలు, వృద్ధుల ఫోన్‌లకు ఎవరెవరు కాల్ చేయాలి, మెసేజ్ పంపాలి అనే దానిపై సంరక్షకులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. దీనివల్ల గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను సులభంగా బ్లాక్ చేయవచ్చు. ఈ ఫోన్‌ మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఈ ఫోన్లు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో కూడా అందుబాటులో ఉంటాయి. అనవసరమైన కాల్స్, సోషల్ మీడియా వంటి వాటి నుంచి తమ ఆత్మీయులను దూరంగా ఉంచాలనుకునే కుటుంబాలకు ఈ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని జియో పేర్కొంది. విద్యార్థుల్లో ఏఐ పరిజ్ఞానాన్ని పెంచే లక్ష్యంతో ‘జియో ఏఐ క్లాస్‌రూమ్’ పేరుతో ఉచిత ఫౌండేషన్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు జియో ప్రకటించింది. జియో ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి రూపొందించిన ఈ కోర్సును జియో పీసీ ద్వారా పీసీలు, ల్యాప్‌టాప్‌లు, జియో సెట్-టాప్ బాక్సుల సహాయంతో స్మార్ట్ టీవీల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. నాలుగు వారాల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఏఐ బేసిక్స్‌, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వంటి విషయాలపై శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి డిజిటల్ బ్యాడ్జ్‌తో పాటు, జియో పీసీ యూజర్లకు జియో ఇన్‌స్టిట్యూట్ నుంచి సర్టిఫికెట్ కూడా అందిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షోరూం ముందే స్కూటీని తగలబెట్టిన యజమాని.. కారణం ఇదే..

Viral Video: బంగారంతో చేసిన అదిరేటి డ్రెస్ ధరించిన యువతి.. ధర తెలిస్తే దడే

Madhya Pradesh: ఓరి బుడ్డోడా.. లక్‌ అంటే నీదే.. రూ.200లతో 53 లక్షలు కొట్టేశావ్‌

SSMB29: నాటు నాటు’ను మించేలా.. మహేశ్‌- ప్రియాంక చోప్రాపై ఫోక్‌ సాంగ్‌

డ్యామ్ గేట్లు తెరవటంతో.. ప్రాణాలు తీసిన పిక్నిక్..