బాబోయ్‌.. జూన్‌ 1 నుంచి ‘ధరల బాదుడు’ మొదలా?

Updated on: May 26, 2026 | 5:49 PM

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సామాన్యులపై భారం మరింత పెరగనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ఆన్‌లైన్ డెలివరీలు, బస్సు ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల కారణంగా రాబోయే రోజుల్లో మరిన్ని ఇంధన ధరల పెంపులు తప్పవని అంచనా వేస్తున్నారు.

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇది కేవలం వాహనదారులకు షాక్‌ మాత్రమే కాదు.. రాబోయే భారీ ఆర్థిక తుపానుకు సంకేతమా? అనే చర్చ మొదలైంది. అమెరికా–ఇరాన్‌ యుద్ధం, హర్ముజ్‌ జలసంధి సంక్షోభం కారణంగా. భారతదేశంలో ఇంధన ధరలను పెంచారు. అయితే ఈ పెంపు ప్రభావం ప్రతి ఇంటి బడ్జెట్‌ను కుదిపేసే పరిస్థితి రావొచ్చని నిపుణులు అంటున్నారు. ఇటు.. సోమవారం మే 25న పెట్రోల్‌ పై లీటర్‌కు రూ. 2.61 డీజిల్‌పై 2.71 చొప్పున పెరిగింది. ఆర్థిక వ్యవస్థలో రవాణా రంగానిది ముఖ్యపాత్ర. కూరగాయల నుంచి పాలు వరకు.. ఆన్‌లైన్‌ డెలివరీ నుంచి విమాన టికెట్ల వరకు.. అన్నీ డీజిల్‌, పెట్రోల్‌పైనే ఆధారపడతాయి. దాంతో ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారీ ఆ ప్రభావం సామాన్యుడి జేబుపైనే పడుతుంది. ముందుగా ప్రజా రవాణాలో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీల ఛార్జీలు పెరగొచ్చని తెలుస్తోంది. సరుకు రవాణా ఖర్చులు పెరిగితే మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పాల ధరలు మరింత పెరగొచ్చు. ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ ధరలు పెరిగాయి. త్వరలోనే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ రేట్లు కూడా పెరగొచ్చని అంచనా. ఇక ఫుడ్‌ డెలివరీ యాప్‌లు, ఈ-కామర్స్‌ కంపెనీలు కూడా డెలివరీ ఛార్జీలను పెంచవచ్చు. ప్రస్తుతం డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న కంపెనీలు.. పెరిగిన లాజిస్టిక్స్‌ ఖర్చుల కారణంగా ఆ ఆఫర్లను తగ్గించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉంది. ట్రాక్టర్లు, మోటార్లు, నీటి పంపులు వంటి వ్యవసాయ పరికరాల కోసం రైతులు డీజిల్‌పైనే ఆధారపడతారు. డీజిల్‌ ధరలు పెరగడం వల్ల సాగు ఖర్చులు పెరిగి.. చివరకు ఆ భారం ఆహార ధరల రూపంలో ప్రజలపైనే పడుతుంది. ఇప్పటివరకు ఇన్‌ఫ్లేషన్‌ ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాలను తగ్గిస్తూ వచ్చింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు పెరగడం, అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలు చల్లారే సూచనలు లేకపోవడం, హర్ముజ్‌లో అనిశ్చితితో రాబోయే రోజుల్లో మరిన్ని ధరల పెంపు తప్పదన్న చర్చ వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

30 వేల అడుగుల ఎత్తులో పైలట్‌కు గుండెపోటు

Ebola Alert: ఎబోలా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం అలర్ట్.. వారికి క్వారంటైన్..

రాత్రి భోజనానికి తిరిగొస్తానంటూ వెళ్లి అనంత లోకాలకు..

అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపేసే సైకో.. OTTలో ఈ రోడ్ సైడ్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

RGV: ఆ స్టార్‌పై నాకు కోపం, ద్వేషం.. RGV ఎమోషనల్ ట్వీట్

Loading...
Unable to load recommendations.
Follow Us