పేటీఎంలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు.. ఎంత మందికి ఉద్వాసన పలికిందంటే ??

|

Jun 13, 2024 | 10:43 AM

లేఆఫ్స్‌ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు టెక్‌ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను సాగనంపింది. తాజాగా ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్-97 కమ్యూనికేషన్స్ తన ఉద్యోగులకు పింక్ స్లిప్స్ పంపిణీ చేసింది. ఎంత మంది ఉద్యోగులను సాగనంపిందన్న సంగతి తెలియరాలేదు.కానీ, ఉద్యోగులను తొలగించినట్లు పేటీఎం ధృవీకరించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర సంస్థల్లో ఉపాధి కల్పనకు సాయపడుతున్నామని పేటీఎం చెబుతున్నట్లు పీటీఐ ఓ వార్తా కథనం ప్రచురించింది.

లేఆఫ్స్‌ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు టెక్‌ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను సాగనంపింది. తాజాగా ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్-97 కమ్యూనికేషన్స్ తన ఉద్యోగులకు పింక్ స్లిప్స్ పంపిణీ చేసింది. ఎంత మంది ఉద్యోగులను సాగనంపిందన్న సంగతి తెలియరాలేదు.కానీ, ఉద్యోగులను తొలగించినట్లు పేటీఎం ధృవీకరించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర సంస్థల్లో ఉపాధి కల్పనకు సాయపడుతున్నామని పేటీఎం చెబుతున్నట్లు పీటీఐ ఓ వార్తా కథనం ప్రచురించింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాజీనామా చేసిన ఉద్యోగులకు కొత్త ఉద్యోగాల కల్పనకు 30 సంస్థలతో కలిసి తమ హెచ్ఆర్ విభాగం పని చేస్తున్నదని పేటీఎం వెల్లడించింది. ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న నేపథ్యంలో ఉద్యోగులందరికీ బోనస్ కూడా విడుదల చేసింది. ఉద్యోగుల తొలగింపు విషయమై తాము అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు పేటీఎం తెలిపింది. సంస్థ సేల్స్ డివిజన్‌లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యలో 3500 మంది తగ్గారు. మార్చి నెలాఖరు నాటికి పేటీఎంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 36,521 మంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీసులపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం నష్టాలు పెరిగాయని తెలుస్తోంది. నియంత్రణాపరమైన నిబంధనలు పాటించడం లేదని తమ తనిఖీలో తేలడంతో మార్చి 15 తర్వాత కొత్తగా ఖాతాలు ప్రారంభించొద్దని, వాలెట్లు, ఫాస్టాగ్ చెల్లింపులు జరపవద్దని కస్టమర్లను ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ నిషేధం తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పేటీఎం నష్టాలు రూ.550 కోట్లకు పెరిగాయి. అంతకుముందు ఏడాది 2022-23 నాలుగో త్రైమాసికంలో రూ.167.5 కోట్ల నష్టాలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ‘నా తమ్ముడు డిప్యూటీ సీఎం’ చిరు ట్వీట్ | క్లీంకార పుట్టిన వేళావిశేషం మెగా కుటుంబానికి పట్టిన అదృష్టం

రిలీజ్‌ అయిన 20 రోజుల్లోనే OTTలోకి విశ్వక్.. GOG వైపే అందరి చూపు

అంచనాలు తలకిందులు చేస్తూ.. OTTలోకి కార్తికేయ సినిమా

Follow us on