జనవరి నుంచి కీలక మార్పులు ఇవే
2025లో ఆర్థిక, నిత్య జీవితంలో కీలక మార్పులు రాబోతున్నాయి. జనవరి 1 నుండి క్రెడిట్ స్కోర్ అప్‌డేట్‌లు వేగవంతం, రైలు సమయాలు, ఆధార్ టికెట్ రిజర్వేషన్ నియమాలలో మార్పులుంటాయి. 8వ వేతన కమిషన్ అమలు, వాహన ధరల పెంపుతో పాటు LPG ధరల సవరణ సామాన్యుల జేబులపై ప్రభావం చూపుతుంది. ఈ నూతన సంవత్సరంలో వచ్చే కీలక మార్పులను తెలుసుకుందాం.
ఆర్థిక విషయాల్లో 2025లో చాలా మార్పులు వచ్చాయి. సామాన్యుల జేబులు, నిత్య జీవితంపై ప్రభావం చూపే పలు మార్పులు రాబోతున్నాయి. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న వేళ అవేంటో చూద్దాం. జనవరి 1 నుంచి క్రెడిట్ రిపోర్ట్ మరింత వేగంగా అప్డేట్ కానుంది. ఇప్పటివరకూ 15 రోజులకు ఒకసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ అవుతుండగా.. ఇకపై బ్యాంకులు వారానికి ఒకసారి బ్యూరోలకు నివేదించాల్సి ఉంది. జనవరి 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఫలితంగా బ్యాంకు లోన్లకు ఎలిజిబులిటీ, క్రెడిట్ హిస్టరీ ఎప్పటికప్పుడే క్రెడిట స్కోరులో అప్డేట్ కానున్నాయి. న్యూ ఇయర్లో రైళ్ల రాకపోకల సమయాలు కూడా మారనున్నాయి. కొత్త టైమ్ టేబుల్ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ లతో పాటు మొత్తం 25 రైళ్ల సమయాలు మారనున్నాయి. సికింద్రాబాద్ – విశాఖపట్నం వందేభారత్ ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి 5.05 గంటలకు బయల్దేరుతుండగా..జనవరి 1 నుంచి 5 గంటలకే బయల్దేరనుంది. సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ ఉదయం 8.20కి బదులుగా 8.10 గంటలకు, సికింద్రాబాద్ – భద్రాచలం కాకతీయ ఎక్స్ ప్రెస్ 5.25కి బదులుగా 5 గంటలకు బయల్దేరనున్నాయి. అలాగే ఆధార్ అథంటికేటెడ్ రిజర్వేషన్లు.. తొలి 15 నిమిషాల వరకే ఉండగా.. డిసెంబర్ 29 నుంచి ఈ సమయంలో 4 గంటలకు పెరిగింది. అంటే.. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకూ ఆథార్ అథంటికేటెడ్ అకౌంట్లు ఉన్నవారు మాత్రమే టికెట్లను రిజర్వేషన్ చేసుకోగలరు. జనవరి 5 నుంచి ఈ సమయం సాయంత్రం 4 గంటల వరకు, 12వ తేదీ నుంచి రాత్రి 12 గంటల వరకూ పంచనుంది. 2025 డిసెంబర్ 31తో 7వ వేతన కమిషన్ గడువు ముగియనుంది. జనవరి 1 నుంచి 8వ వేతన కమిషన్ ప్రారంభం కానుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినా.. వేతన పెంపు నిర్ణయాలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట లభించనుంది. జనవరి 1 నుంచి కార్లు, బైకుల ధరలు పెరగనున్నాయి. ఇక ఎల్పీజీ, కమర్షియల్ గ్యాస్, ఏటీఎఫ్ ధరలను ప్రతీ నెల 1న చమురు కంపెనీలు సవరిస్తాయన్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
