IT రిటర్న్‌లు ఆలస్యమైతే రిఫండ్‌ రాదా ??

Updated on: Feb 24, 2025 | 9:42 PM

నిర్దేశిత గడువులోగా రిటర్నులు దాఖలు చేయడం ఆలస్యమైతే రిఫండ్‌ రాదా? కొత్త ఆదాయపు పన్ను బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే చర్చ నడుస్తోంది. కొత్త బిల్లులోని ఓ నిబంధనపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజాగా దీనిపై ఐటీ శాఖ క్లారిటీ ఇచ్చింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు జులై 31 లోపు రిటర్నులు దాఖలు చేయాలి.

ఏదైనా కారణంతో ఆలస్యమైనా జరిమానాతో డిసెంబర్‌ 31 వరకు రిటర్నులు దాఖలు చేసే వెసులుబాటు ఉంది. రిఫండ్లను పొందే విషయంలో ఎలాంటి మార్పులు లేవు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం.. పన్ను చెల్లింపుదారుడు నిర్దేశిత గడువులోగా రిటర్నులు ఫైల్‌ చేస్తేనే రిఫండ్‌ కోరగలడని చెబుతోందని పన్ను నిపుణులు అంటున్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసినా రిఫండ్‌కు అర్హుడని గుర్తు చేస్తున్నారు. దీని వల్ల ఏదైనా కారణంతో నిర్ణీత సమయంలో పన్ను చెల్లించడంలో విఫలమయ్యే పన్ను చెల్లింపుదారులకు ఈ నిబంధన కష్టంగా మారుతుందని అంటున్నారు. దీనిపై పలువురు పన్ను నిపుణులు ఎక్స్‌ వేదికగా ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ స్పష్టతనిచ్చింది. కొత్త ఆదాయపు పన్ను బిల్లులో రిఫండ్లకు సంబంధించి ఎలాంటి నిబంధనలూ మార్చలేదని తెలిపిది. ఒకవేళ ఆలస్యంగా రిటర్నులు ఫైల్‌ చేసినా రిఫండ్‌కు అర్హులేనని స్పష్టత ఇచ్చింది. ఎక్స్‌ వేదికగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. కొత్త టాక్స్‌ బిల్లు ఆమోదం పొందితే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కీళ్లనొప్పులు వేధిస్తున్నాయా.. జుట్టు విపరీతంగా రాలిపోతుందా..!

మట్టి ఇంట్లో నివాసం.. రూ. 2 కోట్ల జాబ్‌ కొట్టిన టెకీ

జామ పండు.. యాపిల్​.. ఆరోగ్యానికి ఏది మంచిది?

తన డ్రాయింగ్‌తో హంతకుడిని పట్టించిన నాలుగేళ్ల చిన్నారి

కొబ్బరి చిప్పలతో 100 రకాల.. గృహాలంకరణ వస్తువులు