Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకదాని నుంచి మరోదానికి మారడం.. లాభమా? నష్టమా?

|

Feb 15, 2024 | 1:14 PM

ప్రస్తుతం మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు Aలో ఉన్నాయి. మీకు కావలసిన పథకంలో పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఫండ్ హౌస్ B స్కీమ్‌కి బదిలీ చేయాలనుకున్నారు. దీని కోసం మీరు A పథకం నుంచి రిడీమ్ చేయాలి. అంటే యూనిట్లను విక్రయించాలి. రిడెంప్షన్ నుంచి అందుకున్న డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు వస్తుంది. దీని తర్వాత, మీరు మ్యూచువల్ ఫండ్ B పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను రీడీమ్ చేయడంపై మూలధన లాభాల పన్ను ..

Mutual Fund: చాలా మంది మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో డబ్బును పెట్టుబడి పెట్టడం లేదా మరొక స్కీమ్‌కి మార్చడం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న స్కీమ్‌లో ఆశించిన రాబడిని పొందకపోవడం, నష్టాన్ని తగ్గించుకోవడం దీనికి కారణం కావచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో మారడం అంటే అదే మ్యూచువల్ ఫండ్ హౌస్‌లో మీ పెట్టుబడిని ఒక స్కీమ్ నుంచి మరొక స్కీమ్‌కి బదిలీ చేయడం. మీరు డబ్బును ఈక్విటీ స్కీమ్ నుండి డెట్‌కి, డెట్ నుంచి అదే ఫండ్ హౌస్‌ ఈక్విటీ స్కీమ్‌కి మార్చవచ్చు. వివిధ ఫండ్ హౌస్‌ల స్కీమ్‌ల మధ్య పెట్టుబడిని బదిలీ చేయడానికి, ముందుగా రిడెంప్షన్ చేయాలి ఆ డబ్బును మరొక మ్యూచువల్ ఫండ్ హౌస్ పథకంలో పెట్టుబడి పెట్టాలి.

ప్రస్తుతం మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు Aలో ఉన్నాయి. మీకు కావలసిన పథకంలో పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఫండ్ హౌస్ B స్కీమ్‌కి బదిలీ చేయాలనుకున్నారు. దీని కోసం మీరు A పథకం నుంచి రిడీమ్ చేయాలి. అంటే యూనిట్లను విక్రయించాలి. రిడెంప్షన్ నుంచి అందుకున్న డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు వస్తుంది. దీని తర్వాత, మీరు మ్యూచువల్ ఫండ్ B పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను రీడీమ్ చేయడంపై మూలధన లాభాల పన్ను చెల్లించాలి. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకదాని నుంచి మరోదానికి మారడం వల్ల లాభ, నష్టాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి