RBI Repo Rate: వడ్డీరేట్లు యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం ముగిసింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేస్తూ, రెపో రేటును 5.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ప్రకటన చేసింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతం వద్ద కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 29న ప్రారంభమై అక్టోబర్ 1న ముగిసిన ఎంపీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ వర్గాలు ఊహించినట్లే, ఆర్‌బీఐ ఈసారి రెపో రేటును మార్చకుండా స్థిరంగా ఉంచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం
Alia Bhatt: ఇంట్రస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ఆలియా
