‘కంటైనర్’ వెనక ఇంత కథ ఉందా ??
భారతదేశంలో కంటైనర్ల తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్రం ₹10,000 కోట్లను కేటాయించింది. ఇది దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. విదేశీ వాణిజ్యం, ఆర్థిక భద్రత, భౌగోళిక-రాజకీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఈ నిర్ణయం కీలకం. టాటా స్టీల్ వంటి సంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో స్వయం సమృద్ధి లక్ష్యం నెరవేరనుంది.
ఆదివారం నాటి బడ్జెట్‌లో భారత్‌లో కంటైనర్ల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఐదేళ్లలో ఏకంగా రూ.10,000 కోట్లు వెచ్చించాలని కేంద్రం నిర్ణయించింది. సాధారణంగా కనిపించే ఈ ‘డబ్బాల’ తయారీపై ప్రభుత్వం తొలిసారి ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైకి చిన్న విషయంలా అనిపించినా, దీని వెనుక లోతైన ఆర్థిక, భౌగోళిక–రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయి. కంటైనర్ల సరఫరాలో తేడా వస్తే భారత్ విదేశీ వాణిజ్యమే తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ రంగంలో చైనాకు దాదాపు ఏకఛత్రాధిపత్యం ఉండటం భారత్‌కు సవాలుగా మారింది. ప్రపంచ కంటైనర్ తయారీలో 95 శాతం వాటా చైనాదే. సీఐఎంసీ, డాంగ్‌ఫెంగ్, సీఎక్స్‌ఐసీ, సింగమస్ వంటి సంస్థలు ఏటా 50 లక్షలకుపైగా యూనిట్లు తయారు చేస్తున్నాయి. మరోవైపు భారత్ సామర్థ్యం ఏటా కేవలం 30,000 యూనిట్లకే పరిమితం. కొవిడ్ తర్వాత కంటైనర్ ధరలు భారీగా పెరగడంతో భారత ఎగుమతులు ఖరీదైనవిగా మారే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో టాటా స్టీల్, జిందాల్ స్టీల్ వంటి సంస్థలు కంటైనర్ తయారీపై దృష్టి పెట్టాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ అండతో భారత్ కంటైనర్ లైన్ ను ప్రారంభించారు. తాజాగా బడ్జెట్‌లో కేంద్రం రూ.10,000 కోట్లు కేటాయించడంతో దేశీయ తయారీ మరింత వేగం పుంజుకోనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో ‘గోల్డ్’ స్కామ్.. మోసపోయింది ఎవరు అంటే
బంగారం, వెండి కొనేందుకు ఇదే మంచి సమయమా ??
సాగు రంగానికి నిర్మలమ్మ సాయం ఎంత ??