నో టెన్షన్‌.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీ షురూ

Updated on: Mar 17, 2026 | 8:26 PM

దేశవ్యాప్తంగా వంటగ్యాస్, ఇంధన సరఫరాపై వదంతులకు కేంద్రం తెరదించింది. సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, కొరత లేదని స్పష్టం చేసింది. వినియోగదారులు భయాందోళనలకు గురికావద్దని, ముందస్తు బుకింగ్‌లు మానుకోవాలని సూచించింది. బ్లాక్‌మార్కెట్‌, అక్రమ నిల్వలపై తనిఖీలు ముమ్మరం చేసింది. ముడి చమురు నిల్వలు, రిఫైనరీ సామర్థ్యం తగినంతగా ఉన్నాయని, ఎలాంటి అంతరాయం ఉండదని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సరఫరాపై వస్తున్న వదంతులకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. గృహావసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. శనివారం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ ఈ మేరకు కీలక వివరాలను వెల్లడించారు. సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్‌మార్కెట్‌ విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశామని, ఎక్కడా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో స్టాక్ తగినంతగా ఉన్నప్పటికీ, కొందరు వినియోగదారులు భయంతో ముందస్తు బుకింగ్‌లు చేస్తున్నారని, దీనివల్ల సరఫరా వ్యవస్థపై అనవసర ఒత్తిడి పడుతోందని సుజాతా శర్మ వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా, పెట్రోల్, డీజిల్ సరఫరాపై కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. భారత్ వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని, దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేయడంతో సామాన్యులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..

పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో

వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి

విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు

కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??

Follow Us