ఎయిర్‌టెల్‌ బాటలోనే జియో.. మస్క్‌తో రిలయన్స్‌ డీల్‌

Updated on: Mar 18, 2025 | 7:21 PM

ఎలాన్‌మస్క్‌ కు చెందిన ఏరోస్పేస్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌తో రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన డిజిటల్ సంస్థ జియో జత కట్టింది. స్పేస్‌ఎక్స్‌కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా ఉన్న స్టార్‌లింక్‌ సర్వీసెస్.. శాటిలైట్‌ ఆధారిత టెలికాం సేవలను అందిస్తోంది. వినియోగదార్లకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు అందించే దిశగా ఎయిర్‌టెల్ ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకోగా.. ఇప్పుడు జియోకూ ఎయిర్‌టెల్‌ను అనుసరించింది.

భారత్‌లోనూ స్టార్‌లింక్‌ సేవలు అందించేందుకు స్పేస్‌ఎక్స్‌ అనుమతులు పొందాక ఈ రెండు సంస్థలు ఆ సేవలను అందుబాటులోకి తేనున్నాయి. భారతదేశంలో హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి రిలయన్స్ జియో ఎలాన్ మస్క్ స్పేస్-X తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం కింద, జియో తన బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను ఏకీకృతం చేస్తుంది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ను అందించడంలో,భారతదేశ డిజిటల్ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇది ముఖ్యమైనదని రుజువు చేస్తుందని జియో సీఈఓ మాథ్యూ ఒమన్ అన్నారు. ఎలాన్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా స్టార్‌లింక్ పేరుతో శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని అందిస్తోంది. దీంతో పాటు మొబైల్ బ్రాడ్ బ్యాండ్‌ను అందించే ల‌క్ష్యంతో ప‌నిచేస్తోంది. త‌ద్వారా యూజ‌ర్లు స్ట్రీమింగ్, వీడియో కాల్స్, ఆన్‌లైన్ గేమింగ్, రిమోట్ వర్కింగ్ కార్యక‌లాపాలు సులభతరం కానున్నాయి. ఈ క్రమంలోనే ఈ సంస్థతో ఎయిర్‌టెల్‌, జియో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

మీ ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టు ఉందా.. వెంటనే..!

Amitabh Bachchan: కల్కి2పై అమితాబ్ లీక్.. సంబరంలో ఫ్యాన్స్

ఇక యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. ఎంత అంటే

ఈ వయసులో.. చిన్న అమ్మాయితో ముచ్చటగా రొమాన్స్‌