Reliance Jio: జియో కీలక నిర్ణయం.. జెమినీ AI ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ

Updated on: Nov 11, 2025 | 3:30 PM

రిలయన్స్ జియో తన 5G వినియోగదారులకు బంపరాఫర్‌ ప్రకటించింది. రూ.35,100 విలువైన గూగుల్ జెమినీ AI ప్రో ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. ఇది అన్‌లిమిటెడ్ 5G ప్లాన్ (నెలకు ₹349 పైన రీఛార్జ్) ఉన్నవారికి వర్తిస్తుంది. జెమినీ 2.5 ప్రో మోడల్‌తో పాటు ఇతర అధునాతన AI ఫీచర్లను మై జియో యాప్ ద్వారా పొందవచ్చు.

జియో వినియోగదారులకు బంపరాఫర్‌.. గూగుల్ జెమినీ ఏఐ ప్రో ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వెల్లడించింది. మొదట్లో కేవలం 18 నుంచి 25 ఏళ్ల వయసువారికి మాత్రమే పరిమితమైన ఈ ఆఫర్‌ను, ఇప్పుడు 25 ఏళ్లు పైబడిన వారికి కూడా విస్తరించింది. దీంతో జియో 5జీ యూజర్లందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.35,100 విలువైన జెమినీ ఏఐ ప్రో ప్లాన్‌ను యూజర్లు ఉచితంగా పొందవచ్చు. అదికూడా ఏకంగా 18 నెలల పాటు ఉచితం. ఈ ఆఫర్‌ పొందాలంటే కచ్చితంగా అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ యాక్టివేట్ చేసుకుని ఉండాలి. అంటే, నెలకు కనీసం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌తో రీఛార్జి చేసుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ ప్లాన్ కింద యూజర్లకు జెమినీ 2.5 ప్రో మోడల్‌తో పాటు 2జీబీ క్లౌడ్ స్టోరేజీ కూడా లభిస్తుంది. అంతేకాకుండా, వియో 3.1 వీడియో జనరేటర్, నానో బనానా ఇమేజ్ జనరేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు నోట్‌బుక్ ఎల్ఎం, జెమినీ కోడ్ అసిస్ట్, జీమెయిల్, డాక్స్‌లో జెమినీ సేవలను కూడా ఈ ప్లాన్‌లో భాగంగా పొందవచ్చు. ఈ ఆఫర్‌ను పొందేందుకు జియో యూజర్లు తమ ఫోన్‌లోని మై జియో యాప్‌ను ఓపెన్ చేయాలి. యాప్‌లో కనిపించే ‘క్లెయిమ్ నౌ’ అనే బ్యానర్‌పై క్లిక్ చేసి ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్ కొందరు యూజర్లకు మాత్రమే కనిపిస్తోంది. మరికొందరికి ‘రిజిస్టర్ ఇంట్రెస్ట్’ అనే ఆప్షన్ చూపిస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఈ సదుపాయాన్ని దశలవారీగా అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rapido Fake App: ఫేక్‌ ర్యాపిడో యాప్‌తో క్యాబ్‌ డ్రైవర్‌ మోసం

చీకటిమయం కాబోతున్న భూమి.. కారణం అదేనంటున్న నాసా

రోడ్డు పక్కనే 2వేల నాటు కోళ్లు ప్రత్యక్షం.. పండగ చేసుకున్న స్థానికులు

కొడుకు మృతిని తట్టుకోలేక ప్రాణం విడిచిన తండ్రి..

భారత్‌పై లానినా ఎఫెక్ట్‌.. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్‌