ఐటీ రిఫండ్‌ ఇంకా రాలేదా ?? అయితే కారణం ఇదే

Updated on: Dec 03, 2025 | 5:44 PM

ఈ సంవత్సరం ఆదాయ పన్ను రిఫండ్‌లు ఆలస్యం కావడానికి గల కారణాలను ఈ కథనం వివరిస్తుంది, ఇది పన్ను చెల్లింపుదారులలో ఒక సాధారణ ఆందోళన. అధిక క్లెయిమ్‌లు, అనుమానాస్పద డిడక్షన్‌లు, చెల్లని బ్యాంక్ ఖాతాలు, పెండింగ్ ఈ-వెరిఫికేషన్ వంటివి ఆలస్యానికి కారణాలు. ఐటీ శాఖ డిసెంబర్ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మీ రిఫండ్‌ స్టేటస్‌ను ఎలా తనిఖీ చేయాలో, పెండింగ్‌లో ఉంటే ఏమి చేయాలో తెలుసుకోండి.

పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించిన చాలా మందిలో ఇప్పుడు ఒకటే టెన్షన్‌. తమకు రావాల్సిన రిఫండ్‌ ఎప్పుడు వస్తుందా అని. రిటర్నులు దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే వారి ఖాతాల్లో జమ అయ్యేది. అయితే ఈసారి మాత్రం రిఫండ్స్‌ ఆలస్యమవుతూ ఉండటంతో చాలా మంది ఇంకెప్పుడు అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. డిసెంబరు నెలాఖరు కల్లా రిఫండ్స్‌ ప్రక్రియను పూర్తి చేస్తామని ఐటీ శాఖ అంటోంది. ఇంతకీ రిఫండ్‌ ఎందుకు ఆలస్యమవుతోంది? రిఫండ్‌ స్టేట్‌స్‌ను ఎలా చెక్‌ చేయాలో చూద్దాం. టీడీఎస్‌, అడ్వాన్స్‌ ట్యాక్స్‌ లేదా సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ద్వారా చెల్లించాల్సిన పన్ను కంటే అధిక ఆదాయ పన్ను చెల్లించిన ఆదాయ పన్ను చెల్లింపుదారులు అందరూ ఐటీ రిఫండ్‌కు అర్హులు. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 143 (1) ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగిసిన తొమ్మిది నెలల్లోగా ఐటీ శాఖ ఐటీ రిటర్నుల ప్రాసెసింగ్‌ పూర్తి చేయాలి. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌ నెలాఖరు వరకు ఇందుకు గడువు ఉంది. ఆలస్యానికి కారణాలు చూసినట్లయితే.. పెద్ద మొత్తంలో ఉన్న రిఫండ్స్‌ క్లెయిమ్స్‌ను పరిశీలించాల్సి రావడం, కొన్ని రిటర్నుల్లో తెలిపిన అనుమానాస్పద డిడక్షన్లను ఐటీ అధికారులు వ్యక్తిగతంగా సమీక్షించాల్సి రావడం, కొన్ని రిటర్నుల్లో తప్పుడు లేదా అధిక డిడక్షన్లు ఉండటం, రిఫండ్‌ జమ కావాల్సిన బ్యాంకు ఖాతా చెల్లుబాటులో లేకపోవడం.ఈ-వెరిఫికేషన్‌ పెండింగ్‌లో ఉండడం కూడా ఒక కారణం. వడ్డీతో సహా ఎలక్ట్రానిక్‌ -వెరిఫికేషన్‌ పూర్తయిన వెంటనే రిఫండ్‌ ప్రక్రియ ప్రారంభమై మీ బ్యాంకు ఖాతాలో రిఫండ్‌ మొత్తం జమ అవుతుంది. అన్నీ సజావుగా ఉన్నా రిఫండ్‌ ఆలస్యమైతే, రిఫండ్‌ మొత్తంపై ఆర్థిక సంవత్సరం ప్రారం భం నుంచి నెలకు అర శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తారు. అయితే ఇది గడువులోగా ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. మిగతా వారికి రిటర్న్‌ ఫైల్‌ చేసిన గడువు నుంచి చెల్లిస్తారు. ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో లాగినై రిఫండ్‌ స్టేటస్‌ తెలుసుకోవచ్చు. రిఫండ్‌.. బ్యాంకు ఖాతాలో జమ అయింది లేనిది చెక్‌ చేసుకోవచ్చు. ఐటీ శాఖ పోర్టల్‌లోని E నివారణ్‌ సెక్షన్‌ ద్వారా మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. బురదలో ఇరుకున్న ఏనుగు.. కట్ చేస్తే..

ర్యాపిడో బైక్‌ రైడర్‌ ఖాతాలో రూ.331 కోట్లు.. ఈడీ దర్యాప్తు

ప్రపంచంలో అతిపెద్ద శివలింగం బీహార్‌లో త్వరలో ప్రతిష్టాపన

Elon Musk: ఇండియన్స్ లేకుండా అమెరికా అభివృద్ధి అసాధ్యం

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ లో కొత్త రూల్స్