రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. 30 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే ఫెసిలిటీ

Updated on: Jan 02, 2026 | 5:22 PM

ఇండియన్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త! రైలు బయలుదేరడానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. IRCTC వెబ్‌సైట్/యాప్ లేదా స్టేషన్ కౌంటర్ల ద్వారా ‘కరెంట్ బుకింగ్’ పద్ధతిలో ఖాళీ సీట్లను పొందవచ్చు. ఇది అత్యవసర, చివరి నిమిషాల ప్రయాణాలకు ఎంతో ఉపయోగపడుతుంది. అదనపు ఛార్జీలు లేకుండా సాధారణ ధరలకే టికెట్లు లభిస్తాయి.

ఇండియన్ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సాధారణంగా రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. అయితే ప్రయాణించే రోజున టికెట్లు దొరక్క చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు బయలుదేరే సమయానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ సౌకర్యం అత్యవసర ప్రయాణాలు చేసే వారికి, చివరి నిమిషంలో ప్రయాణం ప్లాన్ చేసుకునే వారికి ఉపయోగకరంగా ఉండనుంది. రైలు బయలుదేరే సమయానికి ముందుగా చార్ట్ తయారుచేస్తారు. సాధారణంగా ట్రైన్ బయలుదేరే నాలుగు గంటల ముందు మొదటి చార్ట్ తయారవుతుంది. చివరి చార్ట్ మాత్రం రైలు స్టేషన్ నుంచి బయలుదేరే 30 నిమిషాల ముందు రెడీ అవుతుంది. ఆ సమయంలో సీట్లు ఖాళీగా ఉంటే, ప్రయాణికులు ‘కరెంట్ బుకింగ్’ విధానంలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. అంటే రైలు ప్రయాణానికి అరగంట ముందు వరకు కూడా టికెట్ పొందే అవకాశం ఉంది. ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ-టికెట్ రూపంలో బుక్ చేసుకోవచ్చు. అలాగే రైల్వే స్టేషన్‌లలోని టికెట్ కౌంటర్ల వద్ద కూడా టికెట్లు పొందవచ్చు. బుకింగ్ చేసేముందు సీటు అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.ముఖ్యంగా ఈ టికెట్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. సాధారణ టికెట్ ధరే వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కలవరపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌..22 మంది మృతి

తేనెటీగకు లీగల్‌ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత

10 రోజులు షుగర్ తినడం మానేస్తే మన శరీరంలో జరిగేది తెలిస్తే

జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది

ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం