ప్రయాణికులకు అలెర్ట్.. రైల్వే ఛార్జీల్లో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి
రైలు టికెట్ ధరలు ఈ నెల 26 నుండి పెరుగుతాయి. ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీ. దాటితే కి.మీ.కి ఒక పైసా, నాన్-ఏసీ, ఏసీలో 2 పైసలు పెరుగుతాయి. 500 కి.మీ. పైబడిన నాన్-ఏసీ ప్రయాణానికి రూ.10 అదనంగా చెల్లించాలి. నిర్వహణ ఖర్చులు పెరగడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది, రూ.600 కోట్ల అదనపు ఆదాయం ఆశిస్తోంది.
భారతీయ రైల్వే టికెట్ ఛార్జీలు ఈ నెల 26 నుండి పెరగనున్నాయి. రైల్వే శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈ పెంపు ఆర్డినరీ, నాన్-ఏసీ, ఏసీ క్లాసుల ప్రయాణికులపై భారం మోపనుంది. ఆర్డినరీ క్లాస్‌లో 215 కిలోమీటర్లు దాటి ప్రయాణించే వారికి కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. అయితే, 215 కిలోమీటర్లలోపు ప్రయాణించే ఆర్డినరీ క్లాస్ ప్రయాణికుల టికెట్ ఛార్జీలలో ఎటువంటి మార్పు ఉండదు. నాన్-ఏసీ మరియు ఏసీ క్లాసుల్లో, కిలోమీటర్‌కు రెండు పైసల చొప్పున టికెట్ ధర పెరుగుతుంది. నాన్-ఏసీ రైళ్లలో 500 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు అదనంగా 10 రూపాయల భారం పడనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Avatar 3: ‘పండోరా’ సృష్టించింది.. మన అమ్మాయే
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
బుర్జ్ ఖలీఫాపై పిడుగు.. వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
అత్త కాళ్లపై పడిన అల్లుడు.. ఆమె ఛీకొడుతున్నా కాళ్లు వదల్లేదు
