మొబైల్‌ వినియోగదారులకు కేంద్రం తీవ్ర హెచ్చరిక

Updated on: Nov 20, 2025 | 8:10 PM

కేంద్రం మొబైల్ ఫోన్ ఐఎంఈఐ ట్యాంపరింగ్‌పై కఠిన హెచ్చరిక జారీ చేసింది. టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం ఐఎంఈఐ మార్చడం నాన్-బెయిలబుల్ నేరం. దీనికి మూడేళ్ల జైలు, ₹50 లక్షల వరకు జరిమానా విధించబడతాయి. దొంగిలించిన ఫోన్‌లను గుర్తించకుండా అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. వినియోగదారులు, తయారీదారులు నిబంధనలు పాటించాలి.

ప్రస్తుతకాలంలో మొబైల్‌ ఫోన్‌ మానవాళి జీవితంలో భాగమైపోయింది. సెల్‌ఫోన్‌ లేనిదే అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లలనుంచి వృద్ధుల వరకూ అందరూ దీనికి అడిక్ట్‌ అయిపోయారు. అయితే ఈ మైబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కేంద్రం కీలక హెచ్చరిక జారీచేసింది. మొబైల్ ఫోన్ల ప్రత్యేక గుర్తింపు సంఖ్య అయిన 15 అంకెల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (IMEI) నంబర్‌ను ట్యాంపరింగ్ చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇకపై IMEI నంబర్‌ను మార్చడం నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణించనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు మొబైల్ ఫోన్ల తయారీదారులు, బ్రాండ్ యజమానులు, దిగుమతిదారులు, విక్రయదారులందరికీ టెలికాం శాఖ ఒక ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. కొత్తగా అమల్లోకి వచ్చిన “టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023” ప్రకారం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరూ చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. దొంగిలించబడిన ఫోన్లను గుర్తించకుండా ఉండేందుకు వాటి IMEI నంబర్లను మార్చడం వంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూరగాయలతో పోటీ పడుతున్న గుడ్డు ధర

చిట్టీలు కట్టించుకుని మోసం చేసిన మహిళ.. బాధితులు ఏం చేశారంటే

చిన్నారి చేసిన పనికి చలించిపోయిన దొంగ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే ??

ఉచితగా AI కోర్స్ ఈ విధంగా నేర్చుకోండి.. జీవితంలో సెటిల్ అవ్వండి