రూ.10 కాయిన్‌ చెల్లదంటే చెరసాలే !! కఠిన చర్యలు తప్పవంటూ ఆర్బీఐ హెచ్చరికలు

|

Aug 09, 2024 | 2:01 PM

మీ దగ్గరున్న పది రూపాయల కాయిన్‌ పనికిరాదంటున్నారా? కిరాణాకొట్టులో గానీ మరెక్కడైనా గానీ చెల్లదని వాపస్‌ ఇస్తున్నారా? అయితే అలాంటి వారికి చెరసాల తప్పదని హెచ్చరించండి. ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన పది రూపాయల కాయిన్‌ను చెల్లదంటే చట్టప్రకారం శిక్షార్హులు తప్పవని ఆర్బీఐ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మీ దగ్గరున్న పది రూపాయల కాయిన్‌ పనికిరాదంటున్నారా? కిరాణాకొట్టులో గానీ మరెక్కడైనా గానీ చెల్లదని వాపస్‌ ఇస్తున్నారా? అయితే అలాంటి వారికి చెరసాల తప్పదని హెచ్చరించండి. ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన పది రూపాయల కాయిన్‌ను చెల్లదంటే చట్టప్రకారం శిక్షార్హులు తప్పవని ఆర్బీఐ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెన్‌ రూపీస్‌ కాయిన్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆర్‌బీఐ బుధవారం విజయవాడలో ప్రధాన బ్యాంకర్లు, వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రిటెయిల్‌ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహించింది. ఎలా మొదలైందో తెలియదుగానీ పది రూపాయల నాణెం చెల్లదన్న అపోహ ప్రజల్లో గట్టిగ పాతుకుపోయింది. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కొన్నేళ్లుగా ఆర్బీఐ పలు రకాలుగా అవగాహన కల్పిస్తూనే ఉంది. టెన్‌ రూపీస్‌ కాయిన్‌ చెల్లుతుందని స్వయంగా ఆర్బీఐ క్లారిటీ ఇచ్చినా కూడా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం 14 రకాల డిజైన్లలో 10 రూపాయల నాణాలు చలామణిలో ఉన్నాయి. అవన్నీ చెల్లుబాటు అవుతాయని 2018 జనవరిలోనే ప్రకటించింది ఆర్బీఐ. బ్యాంకులు కూడా వీటిని స్వీకరించాలని, బ్రాంచుల దగ్గర మార్చుకోవచ్చని తెలిపింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చలియార్ నదిలో కొట్టుకొస్తున్న మానవ అవయవాలు

అణుయుద్ధమే జరిగితే ?? 72 నిమిషాల్లో 5 బిలియన్ల మంది ప్రాణాలొదిలే ప్రమాదం

అంత్యక్రియల పేరుతో మోసం శవాలను దాచేసి.. చితాభస్మంగా బూడిద ఇచ్చారు

Follow us on