Ipad: మారుతున్న కాలానికి రోజుకో రంగు..! గుడ్‌బై ఐపోడ్‌.. 20 ఏళ్ళ టెక్‌ వండర్‌కి వీడ్కోలు..

|

May 21, 2022 | 7:24 AM

ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్‌ నుంచి ఓ కొత్త ప్రొడక్ట్‌ ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా.. ఎ‍ప్పుడు సొంతం చేసుకుందామా.. అని టెక్‌ ప్రియులు ఎదురు చూస్తుంటారు. అయితే యాపిల్‌కి ఇంతటి క్రేజ్‌ రావడంలో తొలి బ్రేక్‌ త్రూ అందించింది ఐపోడ్‌. వాక్‌మెన్లకు డిమాండ్‌ ఉన్న కాలంలో


ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్‌ నుంచి ఓ కొత్త ప్రొడక్ట్‌ ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా.. ఎ‍ప్పుడు సొంతం చేసుకుందామా.. అని టెక్‌ ప్రియులు ఎదురు చూస్తుంటారు. అయితే యాపిల్‌కి ఇంతటి క్రేజ్‌ రావడంలో తొలి బ్రేక్‌ త్రూ అందించింది ఐపోడ్‌. వాక్‌మెన్లకు డిమాండ్‌ ఉన్న కాలంలో సింపుల్‌గా అరచేతిలో ఇమిడిపోతూ అద్భుత సౌండ్ తో వెయ్యికి పైగా పాటలను నాన్‌స్టాప్‌గా గంటల తరబడి అందించే గ్యాడ్జెట్‌గా ఇరవై ఏళ్ల క్రితం మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఐపోడ్‌. ఆ రోజుల్లో ఐపోడ్‌ ఓ టెక్నికల్‌ వండర్‌. దీన్ని సొంతం చేసుకోవడం ఓ స్టేటస్‌ సింబల్‌. కాగా.. గడిచిన పదేళ్లలో సాంకేతిక అభివృద్ధి ఊహించని వేగంతో జరిగింది. వందల జీబీని మించిన స్టోరేజ్‌తో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తాయి. ఇంటర్నెట్‌ లభ్యత ఈజీ కావడంతో ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ పెరిగిపోయాయి. ఫలితంగా ఐపోడ్‌ అవసరం తగ్గి ‘వింటేజ్‌’ జాబితాలో చేరింది. డిమాండ్‌ తగ్గినా కస్టమర్ల కోసం ఇన్నాళ్లు సంస్థ మార్కెట్‌లో కంటిన్యూ చేసింది. కానీ ఇలా ఎంతో కాలం కొనసాగించలేమని.. తాజాగా ఐపోడ్‌ ప్రొడక‌్షన్‌ ఆపేస్తున్నట్టు.. మార్కెట్‌ నుంచి డిస్‌కంటిన్యూ చేస్తున్నట్టు యాపిల్‌ ప్రకటించింది.
దీంతో సోషల్‌ మీడియాలో ఐపోడ్‌ జ్ఞాపకాలు, తీపి గుర్తులు వెల్లువెత్తాయి. తమకు ఎంతో చక్కని అనుభూతిని అందించిన ఐపాడ్‌ జ్ఞాపకాలను ట్వీట్ల రూపంలో మెసేజ్‌ల రూపంలో, ఫోటోల రూపంలో పంచుకుంటున్నారు నెటిజన్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

Published on: May 21, 2022 07:24 AM