పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌! ఏటీఎం విత్‌డ్రా ఎప్పటి నుంచి అంటే

Updated on: Sep 26, 2025 | 4:03 PM

పీఎఫ్ ఖాతాదారులకు ఒక శుభవార్త. త్వరలోనే బ్యాంక్ అకౌంట్ మాదిరిగా ఏటీఎంల నుండి పీఎఫ్ డబ్బులు విత్‍డ్రా చేసుకునే సదుపాయం రానుంది. ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని 2026 జనవరిలో ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన తుది నిర్ణయం త్వరలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో తీసుకోనున్నారు.

పీఎఫ్ ఖాతాదారులకు త్వరలోనే ఏటీఎం ద్వారా డబ్బులు విత్‍డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని 2026 జనవరి నుంచి ఈపీఎఫ్ఓ ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన తుది నిర్ణయం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో తీసుకోనున్నారు. ఈ విషయంపై అక్టోబర్ రెండో వారంలో సమావేశం జరిగే అవకాశం ఉంది. గతంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 2025 జూన్ లోనే ఈ సదుపాయాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీని కోసం ఐటీ వ్యవస్థను సిద్ధం చేసినట్లు తెలిపింది. నగదు విత్‍డ్రా పరిమితిపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. పరిమితి విధించకపోతే భవిష్య నిధి లక్ష్యం నీరుగారిపోతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనితో ఏటీఎం విత్‍డ్రా అమలు వాయిదా పడింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానాశ్రయంలో ప్రయాణికుడి ప్యాంట్‌లో దూరి కరిచిన ఎలుక

చాట్‌జీపీటీ సాయంతో రూ. 1.32 కోట్ల లాటరీ గెలిచిన మహిళ

Sink Hole: నడిరోడ్డుపై పేద్ద.. గొయ్యి.. పదుల సంఖ్యలో పడ్డ వాహనాలు

గ్యాస్‌ బండ పేలితే.. పరిహారం చెల్లించాల్సిందే

కన్న కూతురినే.. కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు కారణం తెలిసి అంతా షాక్‌