Air Travelers: విమాన ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్‌.. తక్కువ ధరతో ప్రయాణం..!(వీడియో)

|

Jan 26, 2022 | 9:39 AM

అప్పుడప్పుడు విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటిస్తూ ఉంటాయి విమానయాన సంస్థలు. ఇక తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ‘వావ్‌ వింటర్‌ సేల్‌’ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది.

అప్పుడప్పుడు విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటిస్తూ ఉంటాయి విమానయాన సంస్థలు. ఇక తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ‘వావ్‌ వింటర్‌ సేల్‌’ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా డిసెంబర్‌ 27 నుంచి 31వ తేదీల మధ్య రూ.1,122 ధరతో టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఆ ఆఫర్‌ కింద చెన్నై-బెంగళూరు, బెంగళూరు- చెన్నై, చెన్నై- హైదరాబాద్‌, జమ్మూ-శ్రీనగర్‌ మధ్య విమాన ప్రయాణికులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ధరలో అన్నిఛార్జీలు కలుపుకొని ఉంటాయని స్పైస్‌జెట్‌ తన పోర్టల్‌లో వెల్లడించింది.

ఈ ఆఫర్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే ప్రయాణికులకు ఏవైనా మార్పులు చేయాలనుకుంటే రెండు రోజుల ముందు వరకు తేదీని మార్చుకునే వెలుసుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ తేదీల్లో విమాన టికెట్స్‌ బుక్‌ చేసుకునే వారు జనవరి 15- ఏప్రిల్‌ 15వ తేదీ మధ్య కాలంలో ప్రయాణం చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ టికెట్స్‌ బుక్‌ చేసుకోవాలంటే స్పైస్‌జెట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించి బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే స్సైస్‌ జెట్‌ మొబైల్‌ యాప్‌లో, ఆన్‌లైన్‌ ట్రావెల్‌ పోర్టర్లలో, ఇక ఏజెంట్ల ద్వారా కూడా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది స్సైస్‌జెంట్‌.

Published on: Jan 26, 2022 09:15 AM